Anasuya Bharadwaj: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. అసలు కారణం అదేనా..?
ఫోన్లు పగలకొట్టినా.. సోషల్ మీడియాలో హీరోలను ఆడుకున్నా.. అనసూయకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి డేరింగ్ లేడీ.. ఇప్పుడు గుక్కపెట్టి ఏడ్చింది. ఆపలేనన్ని కన్నీళ్లతో ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Anasuya Bharadwaj: అనసూయ.. యాక్టింగ్ కంటే కాంట్రవర్సీలో ఎక్కువ వినిపిస్తుంటుంది ఈ అందాల యాంకర్ పేరు. తెలివి ఎక్కువే.. తెగింపు ఎక్కువే..! ఫోన్లు పగలకొట్టినా.. సోషల్ మీడియాలో హీరోలను ఆడుకున్నా.. అనసూయకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి డేరింగ్ లేడీ.. ఇప్పుడు గుక్కపెట్టి ఏడ్చింది. ఆపలేనన్ని కన్నీళ్లతో ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పైకి స్ట్రాంగ్ లేడీగా కనిపించే అనసూయ మనసులో ఇంత బాధ ఉందా..? అసలేం జరిగింది..? ఎందుకు ఇంతలా ఏడుస్తోందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ వీడియో ఇప్పటిది కాదని, ఐదు రోజుల కిందటిది అని చెప్పింది అనసూయ. ఆ సమయంలో తన బాధను వ్యక్తీకరించిన క్షణాలను గుర్తుపెట్టుకునేందుకే ఈ వీడియో రికార్డు చేసినట్లు వివరించింది. హలో అందరికీ.. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. పోస్ట్ చూసి మీరందరూ ఎంతో గందరగోళానికి గురై ఉంటారు. ఇకపోతే నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి సమాచారాన్ని పంచుకునేందుకే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్ అవడానికి, ఒకరి కోసం ఒకరం ఉన్నామని చెప్పడానికి, విజ్ఞానాన్ని పంచుకోవడానికి, జీవన విధానాలను, సాంప్రదాయాలను, సంతోషాలను షేర్ చేసుకునేందుకే సోషల్ మీడియా ఉంది అని రాసుకొచ్చింది. చివర్లో ఈ పోస్ట్ ఎందుకు చేసిందో చెప్పుకొచ్చింది.
“నేను ఏ ఫోటోషూట్ చేసినా, సరదాగా ఫోటోలు తీసుకున్నా, డ్యాన్స్ చేసినా, నవ్వుకున్నా, కౌంటర్స్ ఇచ్చినా.. ఏం చేసినా అందరితో షేర్ చేసుకుంటా. అలాగే నా జీవితంలో బాధాకరమైన క్షణాలు కూడా ఉన్నాయి ఆ సమయంలో బలహీనమైపోయి, కుమిలిపోయి ఏడ్చా. దాన్ని కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. ఒక సెలబ్రిటీగా ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నించా. వీలైనంతవరకు స్ట్రాంగ్‌గా ఉండాలనే ప్రయత్నించా. అలా ఉండటమే అసలైన బలం అనుకున్నా. కానీ అది నిజం కాదు. బాధను వ్యక్తపరచడమే అసలైన బలం. నా బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్లనిచ్చి తిరిగి చిరునవ్వుతో లేచి నిలబడతాను” అని రాసింది అనసూయ. ఎప్పుడు చలాకీగా కనిపించే అనసూయ.. పాపం ఇలా ఏడుస్తున్న వీడియో చూసి అభిమానులు తెగఫీలవుతున్నారు.