Anasuya Bharadwaj: అనసూయ సెన్సేషనల్ కామెంట్స్.. అడివి శేష్‌ను వదలని అనసూయ
ఆ మధ్య విజయ్ దేవర కొండ ఫ్యాన్స్‌తో జరిగిన రచ్చ మరిచిపోకముందే.. మరో కాంట్రవర్శికి తెరతీసింది బ్యూటీ. హీరోలందరూ లైనేయడానికే అప్రోచ్ అవుతారనుకుని.. మొదట్లో వాళ్ళను అవాయిడ్ చేసేదాన్నని షాకింగ్ విషయం చెప్పింది.

Anasuya Bharadwaj: సినిమాలకన్నా సోషల్ మీడియా పోస్టులు, ఇంటర్వ్యూలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అనసూయ (Anasuya Bharadwaj). జబర్దస్త్ షో తో తెలుగువారికి పరిచయమైన అనసూయ తన అందం, అభినయంతో ఎంతోమందిని ఫిదా చేసింది. బుల్లితెరకు విరామం తీసుకొని వెండితెర పైకి వచ్చేసింది. ఐటమ్ సాంగ్స్‌లో, అలానే కొన్ని సినిమాలలో మంచి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా అనసూయ రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్‌కి అప్పుడు అందరూ ఫిదా అయిపోయారు.
ఈ నేపథ్యంలో తను హీరోయిన్ ఎందుకు కాలేకపోయానని అనసూయ చెప్పిన జవాబులు వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య విజయ్ దేవర కొండ ఫ్యాన్స్‌తో జరిగిన రచ్చ మరిచిపోకముందే.. మరో కాంట్రవర్శికి తెరతీసింది బ్యూటీ. హీరోలందరూ లైనేయడానికే అప్రోచ్ అవుతారనుకుని.. మొదట్లో వాళ్ళను అవాయిడ్ చేసేదాన్నని షాకింగ్ విషయం చెప్పింది. అంతేకాక అడవి శేష్ (adivi sesh) గూఢచారి మూవీకి అప్రోచ్ అయితే తాను వద్దనుకున్న విషయాన్ని బయట పెట్టింది. తన ఆలోచన తప్పని, తర్వాత దానిని మార్చుకున్నట్లు అసలు సీక్రెట్ రివీల్ చేసింది. సోషల్ మీడియా వచ్చాక ఒకప్పటి కామెంట్స్ కూడా టైం చూసి బయటపెడుతుంటారు కొందరు. ఇదే బాటలో అల్లు అర్జున్‌పై అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ ఇష్యూగా మారింది. అనసూయ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేయడానికంటే ముందు అల్లు అర్జున్ (allu arjun) సినిమాల్లో నటించే అవకాశం అందుకుందట. అది కూడా హీరోయిన్ ఛాన్స్ అని తెలుస్తుంది.
అనసూయ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేయకముందు ఒక గ్రాఫిక్స్ కంపెనీలో వర్క్ చేసిందట. ఆ టైంలో సుకుమార్ ఆర్య2 లో నటించే ఛాన్స్ ఇచ్చాడట. ఆ టైంలో పెళ్లికి రెడీ అవుతున్న బ్యూటీ సినిమాకు నో చెప్పిందట. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప 2 మూవీ కూడా చేస్తోంది. ఈ సినిమాలో దాక్షాయణిగా పవర్ ఫుల్ రోల్ పోషిస్తోంది.