Anasuya Bharadwaj: ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడెందుకు కెలుక్కుంటోంది? అనసూయ కావాలని వివాదం చేస్తోందా ?
కాంట్రవర్సీలకు ఇక దూరం అని ఆమధ్య అనౌన్స్ చేసిన అనసూయ.. కొద్దిరోజులు సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు ఉన్నట్లుండి ఉరుము లేని పిడుగులా మళ్లీ విరుచుకుపడుతోంది. అదీ విజయ్ దేవరకొండ మీదే..! అప్పట్లో కొండబాబుతో పెట్టుకున్న కొరివి అంతా ఇంతా కాదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ విజయ్‌ను టార్గెట్ చేసింది.
Anasuya Bharadwaj: అనసూయకు షార్ట్ టెంపర్ ఎక్కువ అంటారు కొందరు. అది షార్ట్ టెంపర్ కాదు నోటి దూల అని ఘాటుగా రియాక్ట్ అవుతుంటారు మరికొందరు. జబర్దస్త్ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ చేతిలో ఇప్పుడు పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయ్. ఆమెను ఇంతలా సపోర్టు చేస్తుంది ఎవరు..? వెనక ఉండి నడిపిస్తోంది ఎవరు..? అనసూయను లక్కీ అని భావిస్తోంది ఎవరు..? అన్నది పక్కనపెడితే.. ఈ హాట్ యాంకర్ మాటలకు హద్దులు ఉండవ్ అప్పుడప్పుడు.
ఫేస్‌బుక్ కామెంట్ల మీద రియాక్ట్ అయిపోవడాలు.. ఆంటీ అంటే కోపంతో ఊగిపోవడాలు.. ఫ్యాన్ ఫోన్ విరగ్గొట్టడాలు.. అనసూయ ఖాతాలో చాలానే ఉన్నాయ్ ఇలాంటి వివాదాలు. ఐతే ఇలాంటి కాంట్రవర్సీలకు ఇక దూరం అని ఆమధ్య అనౌన్స్ చేసిన అనసూయ.. కొద్దిరోజులు సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు ఉన్నట్లుండి ఉరుము లేని పిడుగులా మళ్లీ విరుచుకుపడుతోంది. అదీ విజయ్ దేవరకొండ మీదే..! అప్పట్లో కొండబాబుతో పెట్టుకున్న కొరివి అంతా ఇంతా కాదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ విజయ్‌ను టార్గెట్ చేసింది. జబర్దస్త్ మానేసిన తర్వాత.. కాస్త లిమిట్స్‌లో కనిపించిన అనసూయ ఇప్పుడు బోల్డ్ కామెంట్స్ చేసింది. దీంతో మళ్లీ అనసూయ పేరు మారుమోగి పోతోంది. అర్జున్ రెడ్డి సమయంలో స్టార్ట్ అయిన ఈ వార్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది.
రీసెంట్‌గా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండను.. ది విజయ్ దేవరకొండ అంటూ పోస్టర్‌లో రాసారు. దీనిపై సోషల్ మీడియాలో అనసూయ.. ఇన్‌డైరెక్ట్‌గా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇదేం పైత్యం అంటూ అనసూయ కామెంట్స్ చేసింది. దీనిపై విజయ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఆంటీ అని సోషల్ మీడియాలో మళ్లీ ఏడిపిస్తున్నారు. ఇదంతా నీకు అవసరమా..? నీ పనేదే నువ్ చూసుకుంటే బెటర్ అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. షోలు లేవ్.. సినిమాలు లేవ్.. దీంతో తన గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదని.. కావాలని అనసూయ ఓవరాక్షన్ చేస్తోందని.. పడిపోయిన క్రేజ్‌ను, గ్రాఫ్‌ను మళ్లీ పెంచుకోవడానికే.. ఇంత పెంట చేస్తోందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇదంతా కావాలని చేస్తున్న వివాదమే తప్ప.. ఇంకొకటి కాదని.. ఇలా వివాదాలతో క్రేజ్ పెంచుకునే బదులు.. కెరీర్ మీద దృష్టి పెట్టొచ్చు కదా అంటూ మరికొందరు సూచిస్తున్నారు.