Syamala : శ్యామలను గెంటేశారా ?
తనకు మాలిన రాజకీయాల్లో తలదూర్చి బంగారంలాంటి కెరీర్ ను నాశనం చేసుకుంది యాంకర్ శ్యామల. బుల్లితెరతో పాటు వెండితెర కూడా ఆమెను పక్కన పెట్టేసిందన్న వార్తలు వస్తున్నాయి.

Anchor Shyamala ruined her career like gold by plunging into politics that was her fault.
తనకు మాలిన రాజకీయాల్లో తలదూర్చి బంగారంలాంటి కెరీర్ ను నాశనం చేసుకుంది యాంకర్ శ్యామల. బుల్లితెరతో పాటు వెండితెర కూడా ఆమెను పక్కన పెట్టేసిందన్న వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ యాంకర్స్ లో ఒకరైన శ్యామల… యాంకరింగ్ తో పాటు నటిగా కూడా మంచి పేరు సంపాదించింది. గత ఏడాది వచ్చిన విరూపాక్ష మూవీలో మంచి క్యారెక్టరే శ్యామలకు దక్కింది. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరింది. ఆ పార్టీ తరపున ప్రచారం చేసింది. అంతవరకూ అయితే ఓకే. కానీ పవన్ కల్యాణ్ ని, చంద్రబాబును టార్గెట్ గా చేసుకొని… నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసింది. ఇంటర్వ్యూల్లో కథలు, కాకరకాయలు చెబుతూ పవన్ ని బాగా టార్గెట్ చేసింది శ్యామల. పిఠాపురంలో తిరుగుతూ వైసీపీ అభ్యర్థి వంగ గీతకు క్యాంపెయిన్ చేసింది. అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్ పై సినీ పరిశ్రమలో చాలా మంది మండిపడ్డారు.
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో యాంకర్ శ్యామలకు కష్టాలు మొదల్యాయి. సోషల్ మీడియాలో శ్యామలను టార్గెట్ చేశారు జనసేన, టీడీపీ అభిమానులు. కొందరు కాల్ చేసి బెదిరించారని కూడా శ్యామల ఓ వీడియో రిలీజ్ చేసిన తన ఆవేదన బయటపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ గా శ్యామలను ఈటీవి, మాటీవీ ఛానెళ్ళు పక్కన పెట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమెకు యాంకరింగ్ ఇవ్వొద్దని డిసైడ్ చేశారని అంటున్నారు. బుల్లి తెరపై ఇక ఆమెకు ఛాన్సులు రావడం కష్టంగానే ఉంది. అటు వెండితెరలోనూ శ్యామలకు అవకాశాలు ఉండవని అంటున్నారు.
టాలీవుడ్ లో నందమూరి, కొణిదెల కుటుంబాలకు మంచి పట్టు ఉంది. అరడజనకు పైగా మెగా హీరోలు ఉన్నారు… అలాగే మెగా ఫ్యామిలీని అభిమానించే దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు బోల్డంత మంది ఉన్నారు. పైగా ఇప్పుడు ఏపీకి చంద్రబాబు సీఎం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అక్కడి రెవెన్యూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా అవసరం. అందుకే టీడీపీ, జనసేనను అభిమానించే ఇండస్ట్రీ ప్రముఖులెవరూ శ్యామలకు అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. దాంతో శ్యామలకు ఈవెంట్స్, సినిమాల్లో అవకాశాలు ఇక లేనట్టే. పాలిటిక్స్ లోకి వెళ్ళినా… వైసీపీ తరపున ప్రచారం వరకూ పరిమితమైతే బాగుండేది. కానీ పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేయడమే శ్యామల కొంపముంచింది. ఇప్పటికే పోసాని కృష్ణమురళిని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ పక్కన బెట్టినట్టు చెబుతున్నారు.