Game Changer : ‘గేమ్ ఛేంజర్’ మామూలుగా ఉండదు
జరగండి.. జరగండి.. సాంగ్‌లో ఓ లిరిక్ ఉంటుంది. జరగండి.. జరగండి.. మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చేనండి.. అంటూ ఓ లిరిక్ ఉంటుంది. అంటే.. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉంటాయని పాటతోనే చెప్పేశాడు శంకర్.

And now once again the game changer Pakka Mass movie has given more kick to the mega fans.
జరగండి.. జరగండి.. సాంగ్‌లో ఓ లిరిక్ ఉంటుంది. జరగండి.. జరగండి.. మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చేనండి.. అంటూ ఓ లిరిక్ ఉంటుంది. అంటే.. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉంటాయని పాటతోనే చెప్పేశాడు శంకర్. ఇక ఇప్పుడు మరోసారి గేమ్ చేంజర్ పక్కా మాస్ సినిమా చెప్పి.. మెగా ఫ్యాన్స్‌కి మరింత కిక్ ఇచ్చాడు. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు శంకర్. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ గురించి చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. లేటెస్ట్‌గా.. శంకర్ చేసిన మరిన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి.
తాను తెలుగులో స్ట్రైట్ సినిమా ఎప్పుటి నుంచో చెయ్యాలి అని అనుకుంటున్నానని.. ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చాడు శంకర్. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని చెబుతూ.. గతంలో రెండు మూడు సార్లు స్ట్రైట్ సినిమా చేయాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. అయితే ఈసారి మాత్రం తెలుగు ఆడియెన్స్‌కి ఎలాంటి మాస్ సినిమా కావాలో.. అలాంటి ఎలిమెంట్స్‌తో గేమ్ ఛేంజర్‌ని రెడీ చేస్తున్నానని తెలిపాడు. అంతేకాదు.. ఇదొక మాస్ చిత్రం అని అన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ నుంచి లైన్ తీసుకొని పూర్తిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఒక స్ట్రైట్ సినిమాగా తెరకెక్కించామని తెలిపారు.
ఇక శంకర్ నుంచి మాస్ ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లో పాటలు ఏ రేంజ్‌లో ఉంటాయో.. అంతకుమించి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. అలాంటిది.. ఇప్పుడు చరణ్ లాంటి మాస్ హీరోకి ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదనే చెప్పాలి. గేమ్ చేంజర్ ఎప్పుడొచ్చిన బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని శంకర్ చెబుతున్నాడు. మరి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడుంటుందో చూడాలి.