చిరంజీవి సినిమా కోసం ఆ సెన్సేషన్ ను రంగంలోకి దించుతున్న అనిల్ రావిపూడి..!

అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చిరంజీవి అభిమానులు కళ్ళలో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభర ఎప్పుడు విడుదలవుతుందో ఫ్యాన్స్ కు కూడా పెద్దగా ఐడియా లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2025 | 11:15 AMLast Updated on: Mar 19, 2025 | 11:15 AM

Anil Ravipudi Is Bringing That Sensation Into The Field For Chiranjeevis Film

అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చిరంజీవి అభిమానులు కళ్ళలో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభర ఎప్పుడు విడుదలవుతుందో ఫ్యాన్స్ కు కూడా పెద్దగా ఐడియా లేదు. అయినా ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అంచనాలు పెట్టుకోకపోవడమే మంచిది అనుకుంటున్నారు వాళ్ళు. ఒకవేళ హిట్ అయింది అనుకోండి బోనస్.. అలా కాకుండా వర్కౌట్ కాలేదు అంటే ముందు నుంచి అనుకుంటున్నదే కదా అని పెద్దగా ఫీల్ అయ్యే మ్యాటర్ కూడా ఉండదు. అందుకే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం అనిల్ రావిపూడి సినిమా మీదే ఉంది ఇప్పుడు. ఈ మధ్యే చిరంజీవిని కలిసి ఫస్టాఫ్ కూడా చెప్పాడు అనిల్. అక్కడక్కడ చిన్నచిన్న మార్పులు తప్పిస్తే కథ మొత్తం చిరంజీవికి బాగా నచ్చింది అని తెలుస్తుంది. ఏ మాత్రం లేట్ చేయకుండా సెకండాఫ్ కూడా పూర్తి చేయాలని మెగా సందేశాలు వెళ్లాయి. ప్రస్తుతం ఇదే పని మీద బిజీగా ఉన్నాడు అనిల్ రావిపూడి.

ఇదిలా ఉంటే ఒకవైపు స్క్రిప్ట్ రాస్తూనే మరోవైపు సినిమాలో ఎవరెవరు ఉండాలి అనే విషయం మీద కూడా పక్కాగా క్యాస్టింగ్ ఇప్పటి నుంచే సెట్ చేస్తున్నాడు అనిల్. హీరోయిన్స్ గా అదితిరావు హైదరి, ఐశ్వర్య రాజేష్ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు కుదిరితే మరో ఇద్దరు హీరోయిన్లను కూడా తీసుకోవాలని చూస్తున్నాడు. ఫైనల్ గా ఇద్దరు మాత్రం సినిమాలో కన్ఫర్మ్ అవుతారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన చాలామంది చిరంజీవి సినిమాలో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వెంకీ సినిమాలో తన కామెడీతో కడుపులు చెక్కలు చేసిన బుల్లి రాజు చిరంజీవి సినిమాలో కూడా కనిపించబోతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కేవలం ఫస్ట్ ఆఫ్ లో మాత్రమే బుల్లి రాజు కామెడీ ఉంటుంది. సెకండాఫ్ లో ఆ బుడ్డోడిని మిస్ అయ్యామనీ అనిల్ రావిపూడికి చాలామంది చెప్పారు. అది దృష్టిలో పెట్టుకొని చిరంజీవి సినిమాలో మనోడికి ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అసలే కామెడీ టైమింగ్ లో చిరు నెక్స్ట్ లెవెల్.. ఇక బుడ్డోడు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన కామెడీతో బాగా నవ్వించేసాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో కడుపులు చెక్కలయ్యేలా సీన్స్ రాసుకుంటున్నాడు అనిల్.

రేపు థియేటర్లో చిరంజీవి, బుల్లిరాజు కలిసి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కు ఆడియన్స్ నవ్వి నవ్వి చచ్చిపోతారు అని తెలుస్తుంది. అలా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ బ్లాక్స్ ప్లాన్ చేస్తున్నాడు అనిల్. ఈ విషయంలో చిరంజీవి కూడా దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. నువ్వు ఏమైనా చెయ్.. కానీ ఒకప్పుడు ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎలా వర్కౌట్ అయిందో.. అలాంటి సినిమా మళ్లీ నాకు ఇవ్వు అని అనిల్ రావిపూడికి చిరంజీవి చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే విషయం మొన్న లైలా ఈవెంట్ లో కూడా చెప్పాడు చిరు. అనిల్ చెబుతున్న ఒక్కో సీన్ చాలా అద్భుతంగా వస్తుంది అన్నాడాయన. మే తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా కనిపిస్తోంది. కేవలం మూడంటే మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి సినిమా విడుదల చేయనున్నాడు అనిల్ రావిపూడి. దీనికి కూడా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువలోనే ఉండబోతుంది. ఎలాగైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కేవలం 30 కోట్లలో పూర్తి చేసే 300 కోట్లు వసూలు చేసి చూపించాడో.. ఈసారి కూడా మహా అయితే 50 కోట్లు ఖర్చు పెట్టించి.. అదే 300 కోట్లకు గురి పెట్టాడు అనిల్ రావిపూడి. చిరంజీవి కాబట్టి ఆ లెక్క ఇంకా పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు.