Anil Ravipudi F4: వర్క్ స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి.. త్వరలోనే సినిమా నుంచి అప్‌డేట్..
ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతినిధి అనిల్ రావిపూడి క్లాసిక్ ఎటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ పేరుతో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన అనిల్.. ఇప్పుడు అదే ఫ్రాంఛైజీలో మరో సినిమా తీయబోతున్నాడు.

Anil Ravipudi
ఎఫ్3 సినిమా క్లైమాక్స్‌లోనే ఎఫ్4 సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు అనిల్. సినిమా క్లైమాక్స్‌లో ఫ్యామిలీ మొత్తం బస్‌లో గోవాకు బయల్దేరుతారు. కానీ డ్రైవర్ సీట్‌లో ఉన్న అనిల్ రావిపూడి మాత్రం మనం వెళ్లేది గోవాకు కాదంటూ అందరికీ షాక్ ఇస్తాడు. ఇక్కడే ఎఫ్4 సినిమా కూడా ఉంటుందని అందిరీక ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఎఫ్3 సినిమా రిజల్ట్ చూసి తరువాత ఎఫ్4 సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేస్తానని చెప్పాడు అనిల్.
కానీ అప్పటికే బాలకృష్ణతో ఓ సినిమా ఉండటంతో ఎఫ్4 సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. బాలకృష్ణతో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా ఆల్మోస్ట్ పూర్తవ్వడంతో.. ఇప్పుడు ఎఫ్4 సినిమా మీద అనిల్ ఫోకస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ఎఫ్2 సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ ఆ తరువాత వచ్చిన ఎఫ్3 సినిమా మాత్రం అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేదు.
ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం రీచ్ కాలేదు. నిజానికి ఎఫ్3 సినిమా హిట్ అయితేనే ఎఫ్4 సినిమా తీస్తానని చెప్పాడు అనిల్. కానీ ఎఫ్3 యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఎఫ్4 తీసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు టాక్. బాలకృష్ణతో చేస్తున్న బగవంత్ కేసరి రీలిజ్ అవ్వగానే ఎఫ్4 సినిమా లాంచ్ చేసే చాన్స్ ఉంది అంటున్నారు. ఈ సినిమా గోవా బ్యాక్‌డ్రాప్‌లో ఫన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలతో రెండు రకాల టాక్స్ తెచ్చుకున్న అనిల్ ఇప్పుడు మూడో సినిమాతో ఎలాంటి రిజల్ట్ పొందుతాడో చూడాలి.