Tripti Dimri: పుష్పరాజ్‌పై మనసు.. అల్లు అర్జున్‌తో త్రిప్తి డిమ్రి
త్రిప్తి ప్రస్తుతం హిందీలో భూల్ భూలయ్య 3లో చేస్తుంది. ఇప్పుడు పుష్ప 2లో కూడా నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఒక స్పెషల్ రోల్‌లో మెరవబోతుందని, ఆమె క్యారక్టర్ కథకి చాలా ముఖ్యమైనదని కూడా అంటున్నారు.

Tripti Dimri: యానిమల్‌తో ఇండియా వైడ్‌గా క్రేజ్‌ని సంపాదించిన ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రి. దీంతో ఆమె నటించబోయే సినిమాల విషయంలో అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది. అంతే కాకుండా ఆమె కొత్త సినిమాల లిస్ట్ కోసం గూగుల్‌లో కూడా సెర్చ్ చేసే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఒక తెలుగు స్టార్ హీరో సినిమాలో త్రిప్తి చెయ్యబోతుందనే వార్త టాక్ అఫ్ ది డేగా నిలిచింది. త్రిప్తి ప్రస్తుతం హిందీలో భూల్ భూలయ్య 3లో చేస్తుంది.
Intermittent Fasting Heart Disease: ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ డేంజర్ ! 91శాతం గుండె పోటుకు అవకాశం !!
ఇప్పుడు పుష్ప 2లో కూడా నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఒక స్పెషల్ రోల్‌లో మెరవబోతుందని, ఆమె క్యారక్టర్ కథకి చాలా ముఖ్యమైనదని కూడా అంటున్నారు. మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరిపారని ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన రావటం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. పుష్ప అనుచరుడిని ట్రాప్ చేయించి చంపించే పాత్రలో బ్యూటీ కనిపించనుందని సమాచారం. పుష్ప 2 లో త్రిప్తి నటించడం పక్కా అయితే కనుక ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే.
అలాగే అల్లు అర్జున్ లాంటి బడా హీరో పక్కన నటిస్తే తెలుగులో బిజీ అవ్వడం ఖాయం. పుష్ప 2 ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అగస్ట్ 15న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. రష్మిక హీరోయిన్ కాగా సుకుమార్ దర్శకుడు.