NTR war : NTRకి జోడీగా యానిమల్ బ్యూటీ…

టాలీవుడ్ (Tollywood) సార్ట్ హీరో (Star Hero), యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ వార్-2 (War 2).

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2024 | 11:31 AMLast Updated on: Apr 17, 2024 | 11:31 AM

Animal Beauty With Ntr

 

 

టాలీవుడ్ (Tollywood) సార్ట్ హీరో (Star Hero), యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ వార్-2 (War 2). ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. స్పై జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే వార్ షూట్ కోసం తారక్ ముంబైలో ల్యాండ్ అయిన కొన్ని విజువల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలానే ఈ సినిమా కోసం తారక్ అభిమానులు ఈగర్ గా ఉన్నారు. అలానే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వార్ -2 ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ క్రేజ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఇటీవల పది రోజుల షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టగా, ప్రస్తుతం హృతిక్-ఎన్టీఆర్ కాంబోలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై చాలానే రూమర్స్ వచ్చాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ కూడా ఒకటి వైరల్ అవుతోంది. అదే ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తుందంటూ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

యానిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రి ఉన్నది తక్కువ సమయమే అయినా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. యానిమల్ సినిమాతో ఈ అమ్మడు నేషనల్ క్రష్ గా మారింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే.. యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న కంటే త్రిప్తికే ఎక్కువ క్రేజ్ వచ్చింది. అలాంటి బ్యూటీ ఇప్పటికే పలు సినిమాలో ఛాన్స్ లు కొట్టేసింది. అయితే తాజాగా త్రిప్తి మరో అద్భుతమైన ఆఫర్ ను కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది.