Tripti Dimri: పాపం.. యానిమల్ బ్యూటీకి ఛాన్సులు రావట్లేదా..?
యానిమల్ మూవీలో సినిమా అంతా ఉన్న రష్మిక పెద్దగా ఫోకస్ కాలేదు. కాని కాసేపే కనిపించి, ఒక పాటలో కవ్వించిన తృప్తి దిమ్రీ మాత్రం పాపులరైపోయింది. అంతే.. సందీప్ రెడ్డి వంగ మరోసారి ఈ లేడీకి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడన్నారు.

Tripti Dimri: బాలీవుడ్ హాట్ బ్యూటీ తృప్తి దిమ్రీ పేరు దేశవ్యాప్తంగా మారిపోయింది. తన పేరు టాలీవుడ్, కోలీవుడ్‌లో మారుమోగుతోంది. కాని దాని వల్ల పైసా ప్రయోజనం లేకుండా పోతోంది. ముఖ్యంగా ప్రభాస్ చేయబోయే రెండు సినిమాల్లో తృప్తినే హీరోయిన్ అన్నారు. కాని అక్కడే ట్విస్ట్ ఉంది. యానిమల్ మూవీలో సినిమా అంతా ఉన్న రష్మిక పెద్దగా ఫోకస్ కాలేదు.
CHIRANJEEVI VS BALAKRISHNA: బాలయ్య రేంజ్.. చిరంజీవిని మించిపోతుందా..?
కాని కాసేపే కనిపించి, ఒక పాటలో కవ్వించిన తృప్తి దిమ్రీ మాత్రం పాపులరైపోయింది. అంతే.. సందీప్ రెడ్డి వంగ మరోసారి ఈ లేడీకి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడన్నారు. ప్రభాస్‌తో సందీప్ తీసే సినిమాలో తృప్తి హీరోయిన్ అన్నారు. కాని కథే రెడీ కాని మూవీలో తృప్తి హీరోయిన్ అంటే అది గాలి వార్తే అని తేలిపోయింది. సరే.. హను రాఘవ పూడి తీయబోయే మూవీలో అయినా ప్రభాస్‌తో జోడీకట్టే ఛాన్స్ తృప్తికి వస్తుందా అంటే, అక్కడ డౌటే అంటున్నారు.
అంతెందుకు బుచ్చి బాబు మేకింగ్‌లో చరణ్ చేసే సినిమాలో కూడా ఈ లేడీని తీసుకోవాలనే చర్చ జరిగింది. పుష్ప 2 ఐటమ్ సాంగ్‌లో యానిమల్ ఫేం తృప్తిని తీసుకుంటే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరిగింది. ఇలా చర్చలు, గాలివార్తలు, రూమర్లే తప్ప తృప్తికి ఇంతవరకు టాలీవుడ్, కోలీవుడ్ నంచి సింగిల్ ఆఫర్ రాలేదు. కనీసం బాలీవుడ్‌లో కూడా తనకి కొత్తగా ఆఫర్ల వరదేం రాలేదు.