Animal: అంతా లాభమే.. ‘యానిమల్’ సునామికి సాక్ష్యం ‘

కేవలం మూడంటే మూడు రోజుల్లో యానిమల్ సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు టాక్ అఫ్ ది పాన్ ఇండియాగా మారాయి. యానిమల్ మూవీ తొలి రోజు రూ.116 కోట్ల గ్రాస్ సాధించిన యానిమల్ ఆ తర్వాత రెండు రోజులకి.. అంటే వీకెండ్స్ అయిన శని, ఆదివారాల్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2023 | 02:47 PMLast Updated on: Dec 04, 2023 | 2:47 PM

Animal Movie Creates Sensation At Box Office With Blockbuster

Animal: రణబీర్ కపూర్ తాజా చిత్రం యానిమల్ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే దేశీయ బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.350 కోట్ల క్లబ్లో చేరింది. డిసెంబర్ 1.. ఈ డేట్ ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఈ డేట్‌లో విడుదలైన యానిమల్ ఇప్పుడు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది.

BRS: బీఆర్‌ఎస్‌ ఒక్కసారి కూడా గెలవని స్థానాలు ఇవే..

కేవలం మూడంటే మూడు రోజుల్లో యానిమల్ సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు టాక్ అఫ్ ది పాన్ ఇండియాగా మారాయి. యానిమల్ మూవీ తొలి రోజు రూ.116 కోట్ల గ్రాస్ సాధించిన యానిమల్ ఆ తర్వాత రెండు రోజులకి.. అంటే వీకెండ్స్ అయిన శని, ఆదివారాల్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ కలెక్షన్స్‌తో సినిమా హిట్ రేంజ్ అందరికి అర్ధం అయ్యింది. విడుదల అయిన అన్ని చోట్లా హౌస్ ఫుల్స్‌తో దూసుకెళ్తున్న యానిమల్ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జవాన్ తర్వాత ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా యానిమల్ నిలిచింది. ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ, అపూర్వమైన విజయం దిశగా దూసుకెళ్తోంది.

ఈ సినిమాను రూ.150 నుంచి రూ.200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే పెట్టిన బడ్జెట్ పోగా.. రూ.100 కోట్లకుపైగా లాభమే వచ్చిందని చెప్పవచ్చు. యానిమల్ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ వన్ మాన్ షో తో పాటు రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ని భద్రకాళి స్టూడియోస్, సినీ వన్, టి సిరీస్ సంస్థలపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.