Tripti Dimri: లేడీ యానిమల్‌ని వేటాడుతున్నారు.. క్యూ కట్టిన తెలుగు ఆఫర్స్
హిందీలో పావుడజన్ సినిమాలు చేసినా పేరు రాలేదు. కాని యానిమల్‌లో పావు గంట కూడా లేని పాత్రలో కనిపించి రష్మిక కంటే ఎక్కువ పేరుతెచ్చుకుంది. ఎక్కువ ఫోకస్ అయ్యింది. ఇప్పుడు చిరు,, సోసియో ఫాంటసీ మూవీలో నాగకన్యగా, అలానే చరణ్ బుచ్చి బాబు మూవీలో ఐటమ్ గాల్ గా కన్ఫామ్ అయ్యింది.

Tripti Dimri: త్రుప్తీ దిమ్రీ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? ఇక మీదట మాటి మాటికి వినాల్సి వచ్చేలా ఉంది. మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌నైనా మనం మర్చిపోతామేమో కాని ఈ పేరుని ఇకమీదట మళ్లీ మళ్లీ వినాల్సి వచ్చేలా ఉంది. తనెవరో కాదు.. యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించిన త్రుప్తీ దిమ్రీ. హిందీలో పావుడజన్ సినిమాలు చేసినా పేరు రాలేదు. కాని యానిమల్‌లో పావు గంట కూడా లేని పాత్రలో కనిపించి రష్మిక కంటే ఎక్కువ పేరుతెచ్చుకుంది. ఎక్కువ ఫోకస్ అయ్యింది.
Urvashi Rautela: టాలీవుడ్ టాప్ స్టార్స్‌ని టార్గెట్ చేసిన ఊర్వశీ రౌటేలా
ఇప్పుడు చిరు సోసియో ఫాంటసీ మూవీలో నాగకన్యగా, అలానే చరణ్ బుచ్చి బాబు మూవీలో ఐటమ్ గాల్ గా కన్ఫామ్ అయ్యింది. అంతేకాదు మణిరత్నం మేకింగ్‌లో కమల్ చేస్తున్నసినిమాలో త్రుప్తి దిమ్రీనే కీరోల్ ప్లే చేయబోతోందట. ఆల్రెడీ తనకి ఆఫర్ అందిందట. అయితే ప్రభాస్‌తో మారుతీ తీసే మూవీలో త్రుప్తికి ఓ సాంగ్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. అంతేకాదు తెలుగు యంగ్ డైరెక్టర్స్ అంతా ఇప్పుడు ఈ హీరోయిన్ మేనేజర్‌కి సంప్రదిస్తున్నారట. తన డేట్లకోసం యంగ్ డైరెక్టర్స్ బాగానే ట్రై చేస్తున్నారట. యానిమల్‌లో తను చేసిన పాత్ర పెద్దదేం కాదు. సింగిల్ సాంగ్‌లో తన అందాలు ఆరబోస్తే వెండితెర వేడెక్కకుండా లేదు. అందుకే ఆఫర్ల వరద కూడా తగ్గట్లేదు.