Nandamuri Balakrishna: బాలీవుడ్‌లో బాలయ్య క్రేజ్.. అన్‌స్టాపబుల్ షోకి రణబీర్ కపూర్..!
టాప్ రేటింగ్‌లో దూసుకుపోతున్న అన్‌స్టాపబుల్ షో క్రేజ్ బాలీవుడ్‌కి కూడా పాకినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ షోలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సందడి చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. రణబీర్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం యానిమల్.

Nandamuri Balakrishna: హ్యాట్రిక్ హిట్లతో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) జోష్ మీదున్నాడు. ఓ వైపు సినిమాలతో, మరోవైపు అన్‌స్టాపబుల్ (UNSTOPPABLE) షో సూపర్ హోస్ట్‌గా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అన్‌స్టాపబుల్ రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సీజన్ నడుస్తోంది. తన మాటల గారడీతో షోను రక్తి కట్టించాడు బాలయ్య. పొలిటీషియన్లు, సినీ తారలతో కలిసి చేసిన సందడి నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. రీసెంట్‌గా మూడో సీజన్‌ని తన సినిమా భగవంత్ కేసరితోనే మొదలుపెట్టాడు.
Bigg Boss 7 : రొమాంటిక్ హౌస్.. ప్రేమికుల అడ్డా గా బిగ్ బాస్ హౌస్..
తాజాగా ఈ షో గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. టాప్ రేటింగ్‌లో దూసుకుపోతున్న అన్‌స్టాపబుల్ షో క్రేజ్ బాలీవుడ్‌కి కూడా పాకినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ షోలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సందడి చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. రణబీర్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం యానిమల్. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ అన్‌స్టాపబుల్ షోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ షోలో రణబీర్ కపూర్ (RANBIR KAPOOR), రష్మిక, సందీప్ వంగా గెస్ట్‌లుగా కనిపిస్తారని సమాచారం. సందీప్ వంగా, రష్మికకు ఇక్కడ మంచి క్రేజ్, మార్కెట్ ఉంది. కాబట్టి ఈ సినిమా నిర్మాతలు తెలుగుపై పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఏస్ ప్రొడ్యూస్ దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. అన్‌స్టాపబుల్‌కి రణబీర్ వస్తున్నాడని ప్రచారం అయితే జరుగుతోంది. కానీ, ఇప్పటి వరకు అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే రావడం మాత్రం కన్ఫామ్ అని తెలుస్తోంది.
యానిమల్ చిత్రాన్ని మొదట ఆగస్టులో విడుదల చేయాలని నిర్ణయించారు. అయినప్పటికీ డబ్బింగ్ వెర్షన్లు, పాటల నాణ్యతపై సందీప్ రెడ్డి వంగా ఆందోళన చెందడంతో చివరి నిమిషంలో ఇది వాయిదా పడింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌గా ట్రైలర్ విడుదల చేయగా అది అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.