ANIMAL: అర్జున్‌రెడ్డికి అన్న.. యానిమల్ టీజర్‌‌కు దేశవ్యాప్తంగా యూత్ ఫిదా..!

అలాంటి అర్జున్ రెడ్డికి అన్న ఉంటే, తనెలా ఉంటాడో చూపించే సాహసం చేశాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ అంటూ తను తీసిన సినిమా తాలూకు టీజర్ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2023 | 06:25 PMLast Updated on: Sep 28, 2023 | 6:25 PM

Animal Teaser Out Now Ranbir Kapoors Rugged Gangster Avatar Promises A Blockbuster

ANIMAL: అర్జున్ రెడ్డి మూవీ వచ్చిన కొత్తలో ఇది ఈ తరం శివ అన్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి మరో ట్రెండ్ సెట్టర్ వచ్చాడన్నారు. అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తే బాలీవుడ్ ఉలిక్కి పడింది. వాళ్లకి ఇలాంటి సినిమాలు అప్పట్లో సత్య అని రామ్ గోపాల్ వర్మ, ఇప్పట్లో సందీప్ రెడ్డినే రుచి చూపించాడన్నారు.

అంతలా అర్జున్ రెడ్డి కథకు భాషలకు అతీతంగా దేశ యూత్ మొత్తం కనెక్ట్ అయ్యింది. అలాంటి అర్జున్ రెడ్డికి అన్న ఉంటే, తనెలా ఉంటాడో చూపించే సాహసం చేశాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ అంటూ తను తీసిన సినిమా తాలూకు టీజర్ వచ్చింది. గ్లింప్స్‌కి మించేలా ఉన్న ఈ టీజర్‌‌కి దేశం మొత్తం ఫిదా అవుతోంది. ఆరేంజ్‌లో కంటెంట్ కనిపిస్తోంది. ఐతే అర్జున్ రెడ్డితో విజయ్ ని స్టార్ గా మార్చిన సందీప్ రెడ్డి, దీన్నే రీమేక్ చేసి బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ఫేట్ మార్చాడు. అప్పటి వరకు హిట్స్ లేక తికమక పడుతున్న తన మార్కెట్ పెంచాడు.

అలానే యానిమల్ మూవీతో రణ్‌బీర్ రేంజ్ స్టార్ డమ్ కూడా మారే ఛాన్స్ ఉంది. తను ఎంత మంచినటుడైనా, కపూర్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తోపాటు స్టార్ గా పేరున్నా, మాస్ ఇమేజ్ లేదు. అన్నీ రొమాంటిక్ ప్రయోగాలే చేశాడు. అలాంటి తనకి సూపర్ స్టార్ అనిపించే రేంజ్ ఇమేజ్ రావాలంటే మాస్ మూవీ పడాలి. యానిమల్ మూవీతో అదే జరుగుతోంది.