Boyapati Srinu: రామ్.. రామ్ చరణ్.. ఇద్దర్నీ ముంచాడు..?
స్కంద విడుదలై ఫ్లాప్ పై వారాలు దాటింది. అయినా ఇప్పుడు కొత్తగా ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ రోజు రోజుకి పెరగటానికి కారణం, అందులోని అద్భుతమైన ఫైట్లు. మానవ మేధస్సుకి అర్ధం కాని లాజిక్స్ తో బోయపాటి తెరకెక్కించిన ఫైట్ సీన్ల క్లిప్పులు ఇప్పడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

Animutyam Skanda with Boyapati Sheen with Ustad Ram It is boring to place the story in the middle of the fights which seem like idle ramblings with logic without head and tail
Boyapati Srinu: ఉస్తాద్ రామ్ తో బోయపాటి శీను తీసిన ఆణిముత్యం స్కంద. తలా తోక లేకుండా లాజిక్స్ తో పనిలేకుండా రాడ్ రంబోలా అనిపించే ఫైట్ల మధ్యలో కథని ఇరికించటం బోయపాటికి వెన్నెతో పెట్టిన విద్య..ఆ విద్య మీదే నెటిజన్లు చాలా ఆలస్యంగా, అది కూడా రెండోసారి ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు.
సోషల్ మీడియాలో స్కంద మీద భారీ ట్రోలింగ్..
స్కంద విడుదలై ఫ్లాప్ పై వారాలు దాటింది. అయినా ఇప్పుడు కొత్తగా ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ రోజు రోజుకి పెరగటానికి కారణం, అందులోని అద్భుతమైన ఫైట్లు. మానవ మేధస్సుకి అర్ధం కాని లాజిక్స్ తో బోయపాటి తెరకెక్కించిన ఫైట్ సీన్ల క్లిప్పులు ఇప్పడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.
ట్రోలింగ్ కి గురయ్యే బోయపాటి శీను తీసే సినిమాలు..
థియేటర్స్ లో వచ్చినప్పుడే పరమ చెత్త సినిమా అంటూ అప్పట్లో ట్రోలింగ్ చేశారు. ఇప్పడుు ఇదే మూవీ ఓటీటీలో దర్శనమిచ్చింది. దీంతో ఇంట్లో తీరిగ్గా చూసి నవ్వుకున్న కొందరు, క్లిప్పులు కట్ చేసి రామ్ బదులు బోయపాటి ఫైట్ సీన్లలో కనిపించటం, చనిపోయిన విలనే కొన్ని షాట్స్ లో దర్శనమివ్వటం లాంటి క్లిప్స్ ని పట్టేశారు. సోషల్ మీడియాలో పెట్టేశారు.
కథ లేకుండా సినిమా, ఫైట్ల మధ్యలో పంచ్ డైలాగ్స్ తో మూవీని ప్లాన్ చేయాలంటే బోయపాటి తర్వాతే.. అందుకే తన పనితనం మీద ముచ్చటపడి స్కందలో లోపాల్ని ఇలా ట్రోల్ చేస్తున్నారు. వినయ విధేయ రామ లోకూడా ఇలానే తల నరికితే అది ఆకాశంలోకి వెళ్లటం, గద్ద వచ్చి ఎత్తుకెల్లటం, రెండు నిమిషాల్లో హీరో ట్రైన్ మీద వందల కిలోమీటర్లు దాటడం.. ఇవన్నీ అప్పట్లో ట్రోల్ అయ్యాయి. తమ హీరోని ఇంత ధారునంగా చూపిస్తావా అంటూ మండిన మెగా ఫ్యాన్స్ కూడా స్కంద విజువల్స్ తో ఓ ఆట ఆడుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.