Anjali: ప్రొడ్యూసర్ ప్రేమలో హీరోయిన్.. విడాకులు తీసుకున్న నిర్మాతతో లవ్..!
అంజలి వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త నెట్టింట్ల తెగ చక్కర్లు కొడుతుంది. ఈ అందాల భామ ఓ టాలీవుడ్ బడా నిర్మాతతో ప్రేమాయణం నడిపిస్తుందట. ఆయనకు ఇదివరకే పెళ్లై ఈ మధ్యే తన భార్యనుంచి విడాకులు కూడా తీసుకున్నారట.
Anjali: అచ్చ తెలుగు అమ్మాయి, అందాల హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనుసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా గీతాంజలీ మళ్లీ వచ్చింది, గేమ్ ఛేంజర్ వంటి చిత్రాల్లో నటిస్తూ పలు చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో అంజలి వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త నెట్టింట్ల తెగ చక్కర్లు కొడుతుంది. ఈ అందాల భామ ఓ టాలీవుడ్ బడా నిర్మాతతో ప్రేమాయణం నడిపిస్తుందట. ఆయనకు ఇదివరకే పెళ్లై ఈ మధ్యే తన భార్యనుంచి విడాకులు కూడా తీసుకున్నారట.
Jr NTR: ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్.. క్రేజీ అప్డేట్..
ఆ ప్రొడ్యూసర్‌తో పీకల్లోతు ప్రేమల ఉన్న అంజలి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని తెలుస్తోంది. 2006లో ఫోటో అనే సినిమాతో తెలుగులో వెండి తెరకు పరిచయమైన అంజలి.. ఆ తర్వాత తమిళ్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంది. ఇక జర్నీ సినిమాతో తమిళ్, తెలుగులో మంచి స్టార్డమ్ అందుకుంది. అక్కడి నుంచి తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. పలు లేడి ఓరియేంట్ సినిమాలు కూడా చేసింది. ప్రస్తుతం గీతాంజలి మళ్లీ వచ్చింది, గేమ్ చేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. ఫ్యామిలీ, ప్రేమ విషయంలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది అమ్మడు. అప్పట్లో కుటుంబ గొడవలతో కొన్నాళ్లు సినిమాలకు దూరం కూడా అయింది.
అలాగే.. తమిళ హీరో జైతో ప్రేమ అంటూ వార్తల్లో నిలిచింది. ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. లివ్ ఇన్ రిలేషన్లో కూడా ఉన్నారని.. పెళ్లికి కూడా రెడీ అయ్యారంటూ వార్తలొచ్చాయి. కానీ ఏమైందో ఏమోగానీ ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్టుగా టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఓ టాలీవుడ్ బడా నిర్మాతతో ప్రేమలో ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలోనే అంజలి ఆ నిర్మాతను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోందట. మరీ ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.