Anjali controversy : అంజలి కథ మొత్తం చెప్పేసిందిగా..!
నటి అంజలి (Anjali) తో బాలకృష్ణ వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) లో గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ (Balakrishna) హాజరయ్యారు.

Anjali tells the whole story..!
నటి అంజలి (Anjali) తో బాలకృష్ణ వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) లో గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ (Balakrishna) హాజరయ్యారు. స్టేజ్‌పై ఉన్న హీరోయిన్ అంజలిని ఆయన చేతితో నెట్టినట్లు చేశారు. దీంతో కాస్త తడబడిన తెలుగు బ్యూటీ తర్వాత నవ్వేసి కవర్ చేసుకుంది. దీంతో ఆ క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. స్టేజ్ మీదున్న హీరోయిన్‌తో అలా ప్రవర్తించడం ఏమిటని నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు సైతం గరం గరం వ్యాఖ్యలు చేశారు.
ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్నట్లుగా హీరోయిన్ అంజలి ఇండైరెక్ట్‌గా ఓ ట్వీట్ చేశారు. గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలకృష్ణ హాజరైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆయనతో తనకు ఎప్పటి నుంచో స్నేహం ఉందంటూ రాసుకొచ్చారు. తమ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉందంటూ రాశారు. అలాంటి వ్యక్తితో స్టేజ్‌ని పంచుకోవడం ఎంతో అద్భుతంగా ఉందంటూ పేర్కొన్నారు. దీంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఆమె ఈ విధంగా ట్వీట్ చేశారంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఈ విషయమై గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) సైతం స్పందించారు. అసలు అక్కడ జరిగింది వేరు అంటూ చెప్పుకొచ్చారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చే క్రమంలోనే బాలయ్య అంజలిని పక్కకు జరగమన్నారన్నారు. దాన్ని అంజలి కూడా సరదాగానే తీసుకున్నారని చెప్పారు. సోషల్ మీడియా మాత్రం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని అన్నారు. ముందు, వెనుకలు కట్ చేసి ఆ చిన్న క్లిప్‌ని పదే పదే వైరల్ చేశారని, ట్రోల్స్ చేశారని అన్నారు.