Geethanjali Malli Vachindi: గీతాంజలి మళ్లీ వచ్చేసింది.. పాడుబ‌డ్డ బంగ్లాలో అంజలి పాప

అంజ‌లి న‌టిస్తోన్న 50వ సినిమా ఇది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొత్త ఏడాది 2024 ప్రారంభం సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 1, 2024 | 02:47 PMLast Updated on: Jan 01, 2024 | 3:29 PM

Anjalis Geethanjali Malli Vachindi First Look Released

Geethanjali Malli Vachindi: అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014 వచ్చిన విజయవంతమైన హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’కి సీక్వెల్‌ గా రూపొందుతోంది. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు.

Devara: దండయాత్ర.. దేవర’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

అంజ‌లి న‌టిస్తోన్న 50వ సినిమా ఇది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొత్త ఏడాది 2024 ప్రారంభం సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పాడుబడ్డ భవంతిలో నాట్య కళాకారిణి లుక్‌లో అంజలి కనిపిస్తోంది. ఓ వైపు అంజలి లుక్.. మరో వైపు భవంతి బ్యాక్ డ్రాప్ చూస్తుంటే సరికొత్త కథ, కథనంతో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైందని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘గీతాంజ‌లి మ‌ళ్ళీ వ‌చ్చింది’ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు. ‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన హార‌ర్ కామెడీ చిత్రాల‌న్నీ ఒక ఎత్తైతే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’లో హార‌ర్ కామెడీ వాట‌న్నింటినీ మించేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ‘నిన్ను కోరి’, ‘నిశ్శబ్దం’ చిత్రాల‌కు కొరియోగ్ర‌ఫీ చేసిన శివ తుర్లపాటి డైరెక్టర్‌గా ఈ చిత్రంతో ప‌రిచ‌యమవుతున్నారు. ఈ సినిమాను 2024 ప్రారంభంలో దక్షిణాది భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు. కోన వెంక‌ట్‌ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ల‌క్కరాజు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సుజాత సిద్ధార్థ్, ఆర్ట్ డైరెక్టర్‌గా నార్ని శ్రీనివాస్‌, ఎడిట‌ర్‌‌గా చోటా కె ప్రసాద్‌ వ్యవహరిస్తున్నారు.