BIGG BOSS: ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రెగ్నెంట్ అయిందా..?

ఈ సీజన్‌లో బాలీవుడ్‌ జంట అంకితా లోఖండే, విక్కీ జైన్‌ హౌస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ జంట ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇద్దరు గొడవలు పడటం, ఆ తర్వాత కలుసుకోవడం వంటివి ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా అంకిత లోఖండే.. ఓ ఆసక్తికర విషయాన్ని భర్తకు తెలియజేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 07:15 PMLast Updated on: Nov 16, 2023 | 7:15 PM

Ankita Lokhande Takes Pregnancy Test Inside Bigg Boss House

BIGG BOSS: రియాల్టీ షో బిగ్ బాస్.. నార్త్ ఆడియన్స్‌ను మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్‌ను సైతం ఎంతగానో అలరిస్తుంది. తెలుగు విషయానికి వస్తే గత సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సీజన్ 7 మాత్రం ఉల్టా పుల్టా చేస్తూ రేటింగ్‌లో దూసుకెళ్తుంది. ప్రస్తుతం 11వ వారానికి చేరుకుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారో అనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఇదిలా ఉంటె రీసెంట్‌గా హిందీలో ప్రారంభమైన సీజన్ 17కు సంబదించిన ఓ వార్త ఇప్పుడు అందర్నీ షాక్‌కు గురి చేస్తుంది.

RAM CHARAN: గ్లోబల్ స్టార్‌తో లేడీ సూపర్ స్టార్.. రామ్ చరణ్‌తో సాయిపల్లవి..

ఈ సీజన్‌లో బాలీవుడ్‌ జంట అంకితా లోఖండే, విక్కీ జైన్‌ హౌస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ జంట ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇద్దరు గొడవలు పడటం, ఆ తర్వాత కలుసుకోవడం వంటివి ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా అంకిత లోఖండే.. ఓ ఆసక్తికర విషయాన్ని భర్తకు తెలియజేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఎపిసోడ్‌లో తనకు పులుపు తినాలని అనిపిస్తోందని చెప్పింది. దీనిపై రింకూ ధావన్ కూడా ఆమెను ప్రెగ్నెన్సీ గురించి ఆటపట్టించాడు. రీసెంట్‌గా తన భర్తతో అంకిత లోఖండే మాట్లాడుతూ.. తనకు ఈ నెల పీరియడ్స్ రాలేదని, ఒంట్లో కూడా బాగుండటం లేదని, ఇంటికి వెళ్లాలనిపిస్తోందని చెప్పింది. అవునా.. ఈ నెలా నీకు పీరియడ్స్ వచ్చాయి అనుకున్నానే అని భర్త విక్కీ అన్నాడు.

లేదు నిన్న మెడికల్ రూమ్‌కు పిలిచి రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేశారు. కానీ రిజల్ట్ చెప్పలేదు అని, అందుకే తనకు టెన్షన్ అవుతున్నానని అంకిత చెప్పింది. దీంతో విక్కీ షాక్ అవుతాడు. ప్రస్తుతం వీళ్ల మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంకిత నిజాంగానే ప్రెగ్నెంట్ అనే విషయం ఖాయం అయితే బిగ్ బాస్ హౌస్‌లో ప్రెగ్నెంట్ అయిన పేరెంట్స్ వీరేనని రికార్డు సృష్టించడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.