సర్దార్ 2 సెట్‌లో మరో ప్రమాదం.. అప్పుడేమో చనిపోయారు.. ఇప్పుడేకంగా హీరో కార్తి..!
కార్తి.. పేరుకు తమిళ హీరో అయినా తెలుగులోనూ ఈయనకు మంచి గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే కార్తి సినిమాలకు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు వస్తుంటాయి.

కార్తి.. పేరుకు తమిళ హీరో అయినా తెలుగులోనూ ఈయనకు మంచి గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే కార్తి సినిమాలకు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు వస్తుంటాయి. అంతగా మన హీరోలా కలిసిపోయాడు కార్తి. ఇప్పుడు ఈయనకు యాక్సిడెంట్ అయింది.. అది తెలిసి కంగారు పడుతున్నారు అభిమానులు. ప్రస్తుతం సర్దార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు కార్తి. ఈ షూటింగ్‌లోనే ఆయనకు ప్రమాదం జరిగింది. దాంతో కాలికి గాయం అయింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతుంది. అక్కడే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ షూటింగ్‌లో భాగంగానే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నపుడు ప్రమాదం చోటు చేసుకుంది.
దాంతో వెంటనే స్పందించిన చిత్రయూనిట్.. ఆయన్ని సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం మరీ పెద్దదేమీ కాకపోయినా.. తగిలిన దెబ్బకు కచ్చితంగా వారం రోజులైతే విశ్రాంతి తీసుకోవాల్సిందే అని చెప్పారు వైద్యులు. దాంతో వెంటనే ఆయన చెన్నై వచ్చేశాడు. కార్తికి అయిన గాయంతో షూటింగ్ కూడా క్యాన్సిల్ చేయక తప్పలేదు. యూనిట్ కూడా చెన్నై రిటర్న్ అయిపోయారు. 10 రోజుల తర్వాత మళ్ళీ ఇదే షెడ్యూల్ తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. ఈ షెడ్యూల్ అంతా హీరోపైనే ప్లాన్ చేసారు మేకర్స్. ఇప్పుడాయనకే గాయం కావడంతో ఆపేయక తప్పలేదు. అయితే ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదు.
ఈ సినిమా ప్రారంభమే విషాదంతో మొదలైంది. చెన్నైలో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతున్నపుడు ప్రమాదవశాత్తు ఒక స్టంట్ మాన్ మరణించాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో ఆయన అదుపుతప్పి చనిపోయాడు. ఇప్పుడు హీరో కార్తీ గాయాల పాలయ్యాడు. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. సర్దార్ 2022లో వచ్చిన సర్దార్ సినిమాకు సీక్వెల్ ఇది. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. భారీ బడ్జెట్‌తో సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మిత్రన్.