మరో అనుష్కలా మారిన నివేదా— లావు వెనక సీక్రెట్ ఏమిటి
ఆ హీరోయిన్ని చూస్తుంటే.. అనుష్క గుర్తుకొస్తోంది. స్వీటీలా వుంది.. పోలికలు కలిశాయనుకోవడానికి వీల్లేదు. వెయిట్ విషయంలో ఇద్దరూ ఒక్కటే అనిపిస్తోంది. అనుష్క సైజ్ జీరో కోసం వెయిట్ పెరిగి తర్వాత తగ్గలేకపోయింది.
ఆ హీరోయిన్ని చూస్తుంటే.. అనుష్క గుర్తుకొస్తోంది. స్వీటీలా వుంది.. పోలికలు కలిశాయనుకోవడానికి వీల్లేదు. వెయిట్ విషయంలో ఇద్దరూ ఒక్కటే అనిపిస్తోంది. అనుష్క సైజ్ జీరో కోసం వెయిట్ పెరిగి తర్వాత తగ్గలేకపోయింది. ఓ యంగ్ హీరోయిన్ గుర్తుపట్టలేనంతగా షేప్ అవుట్ అయింది. గ్లామర్ అంటే హీరోయిన్.. హీరోయిన్ అంటేనే గ్లామర్. అయితే ఇలాంటి రూల్ నివేద థామస్‌కు వర్తించదు. కేవలం తన నటనను మాత్రమే నమ్ముకుని.. కెరీర్ సాగించింది. అయితే వున్నట్టుంది రెండేళ్ల నుంచి కనిపించలేదు.
కొత్త సినిమా ’35 చిన్న కథ కాదు’తో మళ్లీ తెరపైకి వచ్చింది. నివేదా థామస్ రెజీనాతో కలిసి లీడ్‌రోల్ పోషించిన శాకిని.. ధాకిని మూవీ తర్వాత మరో మూవీలో నటించలేదు. కొంతకాలంగా పోస్ట్ చేసిన ఫొటోల్లో వెయిట్ బాగా పెరిగినట్టు కనిపించింది. 35 చిన్న కథ కాదు’ ప్రమోషన్లో చూసి షాక్ అయ్యారు అభిమానులు. జెంటిల్‌మేన్‌తో తెలుగులోకి అడుగుపెట్టిన నివేద థామస్ వరుస సక్సెస్‌లతోపాటు.. నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. దర్బార్‌లో రజనీకాంత్ కూతురుగా నటించి ఆకట్టుకుంది. జెంటిల్‌మేన్ ..నిన్నుకోరి తర్వాత మరోసారి నానితో ‘వి’ .. వకీల్‌సాబ్‌లో ఇంపార్టెంట్ రోల్ పోషించింది నివేద. 35 చిన్నకథకాదు’లో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించింది.