మహేష్, రాజమౌళి సినిమా గురించి మరో క్రేజీ న్యూస్.. SSMB29 కోసం జక్కన్న అలా..!
మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ జరిగిన జరగకపోయినా ట్రెండింగ్ లో మాత్రం ఉంటుంది. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షూటింగ్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు.

మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ జరిగిన జరగకపోయినా ట్రెండింగ్ లో మాత్రం ఉంటుంది. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షూటింగ్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. మహేష్ బాబు మరోసారి ఫ్యామిలీ ట్రిప్ వెళ్లిపోయాడు. మామూలుగా తన సినిమాల్లో నటించే హీరోలకు ఇలాంటి వెసలుబాటు ఇవ్వడు రాజమౌళి. కానీ మహేష్ ఒక్కడికి మాత్రం కావలసినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు జక్కన్న. కానీ మిగిలిన హీరోలతో పోలిస్తే SSMB29 షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. జనవరి చివర్లో షూటింగ్ మొదలైంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. మామూలుగా రాజమౌళి సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకోవాలంటే కనీసం 6 నెలలు కావాలి. కానీ మహేష్ సినిమా మాత్రం కేవలం నాలుగు వారాలలో 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
షూటింగ్ చేయడానికి అంతగా సహకరిస్తున్నాడు కాబట్టే మహేష్ బాబుకు కొన్ని రోజులు సెలవులు ప్రకటించాడు రాజమౌళి. ప్రస్తుతం సమ్మర్ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్ స్టార్. 20 రోజుల పాటు కుటుంబంతో ఫారిన్ ట్రిప్ వెళ్ళాడు మహేష్. గౌతమ్ ఆల్రెడీ అమెరికాలోనే ఉన్నాడు.. మన వైపు నమ్రత కూడా ఈ మధ్య యుఎస్ వెళ్ళింది. సితార మాత్రం తండ్రి మహేష్ బాబుతో కలిసి మొన్న అమెరికా వెళ్లిపోయి. ఏప్రిల్ నెలాఖరులో ఆయన ఇండియా రానున్నాడు. మహేష్ వచ్చిన వెంటనే మళ్ళీ నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఆయన వచ్చేందుకు నెక్స్ట్ షెడ్యూల్ కు కావలసినవన్ని సిద్ధం చేయనున్నాడు రాజమౌళి. షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు నో బ్రేక్స్ అంటున్నాడు జక్కన్న. ఈ కండిషన్ మీదే సమ్మర్ హాలిడేస్ ఇచ్చాడు రాజమౌళి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఇది రెండు భాగాలుగా వస్తుంది అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించింది. మూడు గంటల 30 నిమిషాలకు పైగా నిడివితో కేవలం ఒక భాగంగా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని రెండు భాగాలుగా చేయకూడదు అనేది ఆయన బలంగా నిశ్చయించుకున్నాడు. ఈ లెక్కన ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా కేవలం ఒక పార్ట్ గానే రాబోతుంది అన్నమాట. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.