Trivikram, Top Heroines : త్రివిక్రమ్ ఆశీస్సులతో ఇండస్ట్రీకి మరో టాప్ హీరోయిన్
హీరోయిన్ ని వెతికి పట్టుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. టాలెంట్ ని గుర్తించి దగ్గర ఉంది వాళ్ళని ట్రైన్ చేసి.ఒక స్టేటస్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెడతాడు త్రివిక్రమ్. అక్కడి వరకు బాగానే ఉంది. తేడా వస్తే అలాగే వదిలేస్తారు కూడా. గతంలో సమంత.. పూజా హెగ్డే.. మీనన్.. వరసలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు స్టార్ మీనాక్షి చౌదరి వైపు తిరిగింది.

Another heroine became a top heroine with the blessings of Trivikram Pooja reached the level of high remuneration with the blockbuster Pooja Hegde Ala Vaikunthapuram
త్రివిక్రమ్ ఆశీస్సులతో మరో హీరోయిన్ టాప్ హీరోయిన్ అయిపోయింది. పూజా హెగ్డే అల వైకుంఠపురంలో బ్లాక్‌బస్టర్‌తో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి పూజా చేరింది. త్రివిక్రమ్ అండతో సినిమా రిలీజ్ కాకుండానే స్టార్ అయిపోయి.. రెండు కోట్లు డిమాండ్ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ఆమె మీనాక్షి చౌదరి. అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పలేం. 26 ఏళ్ల పొడుగుకాళ్ల సుందరి మీనాక్షి చౌదరిని చూస్తే ఇదే అనిపిస్తుంది. చిన్న సినిమాతో యంగ్ హీరోతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి… ప్రస్తుతం స్టార్స్‌తో నటిస్తోంది.. లేటెస్ట్‌గా పాన్ ఇండియా ఆఫర్ అందుకుంది. ఇలా రెండు నెలల్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది మీనాక్షి. గుంటూరు కారంలో పూజా హెగ్గే ప్లేస్‌ను మీనాక్షి చౌదరితో గురూజీ భర్తీ చేశాడు మహేశ్ పక్కన ఛాన్స్ కొట్టేయడంతో.. మీనాక్షి ఆటోమెటిక్‌గా స్టార్ అయిపోయింది. లియో తర్వాత విజయ్ నటించే సినిమాలో మీనాక్షి హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మీనాక్షి ప్రస్తుతం విశ్వక్‌సేన్ మూవీతోపాటు.. మట్కా చిత్రంలో నటిస్తూ.. పాన్ ఇండియా ఆఫర్ అందుకుంది. సార్ తర్వాత వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘లక్కీ భాస్కర్’లో దుల్కర్ సల్మాన్‌తో జత కడుతోంది మీనాక్షి.
హర్యానాలో పుట్టిన మీనాక్షి డెంటల్ డాక్టర్ అనిపించుకుని.. సుశాంత్ హీరోగా ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఆతర్వాత ఖిలాడీ మూవీలో రవితేజాతో జత కట్టింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ఆఫర్స్ తగ్గినా.. హిట్2తో ఓకె ఓకె అనిపించుకున్నా.. క్రేజీ ఆఫర్స్ దక్కలేదు. గుంటూరు కారం ఆఫర్‌తో ఒక్కసారిగా జాతకం మారిపోయింది. ఒకవైపు స్టార్స్.. మరోవైపు పాన్ ఇండియా ఆఫర్స్‌తో టాప్ ఛైర్ హీరోయిన్స్ సరసన చేరింది మీనాక్షి.
హీరోయిన్ ని వెతికి పట్టుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. టాలెంట్ ని గుర్తించి దగ్గర ఉంది వాళ్ళని ట్రైన్ చేసి.ఒక స్టేటస్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెడతాడు త్రివిక్రమ్. అక్కడి వరకు బాగానే ఉంది. తేడా వస్తే అలాగే వదిలేస్తారు కూడా. గతంలో సమంత.. పూజా హెగ్డే.. మీనన్.. వరసలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు స్టార్ మీనాక్షి చౌదరి వైపు తిరిగింది.