ప్రభాస్ ఖాతాలో మరో హీరోయిన్.. ఇలా మాయ చేస్తున్నారేంటి రాజుగారు..!
ఈ మధ్య నా టైమ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు.. అదేంటో చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతి అమ్మాయి..! గుర్తుందా ఈ డైలాగ్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం మహేష్ బాబు ఈ డైలాగ్ చెప్పాడు..

ఈ మధ్య నా టైమ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు.. అదేంటో చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతి అమ్మాయి..! గుర్తుందా ఈ డైలాగ్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం మహేష్ బాబు ఈ డైలాగ్ చెప్పాడు.. కానీ దీనికి పర్ఫెక్ట్ గా సరిపోయే హీరో మాత్రం ప్రభాస్. ఎందుకో తెలియదు కానీ మన వాడిని చూడగానే ప్రతి హీరోయిన్ లవ్ లో పడిపోతుంది. అది మనసులో పెట్టుకోవడం కాదు బయట కూడా చెప్పేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ప్రభాస్ మీద తనకున్న ప్రేమను మీడియా ముందు చెప్పేసింది. ఆమె ఎవరో కాదు మాళవిక మోహనన్. తెలుగులో ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. దీంతోపాటు మరో రెండు మూడు అవకాశాలు కూడా ఈ భామకు వచ్చేలా కనిపిస్తున్నాయి. దాంతో తెలుగు ఇండస్ట్రీని సీరియస్ గా తీసుకొని తెలుగు భాష కూడా నేర్చుకుంటుంది మాళవిక.
ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో నటించేటప్పుడు కచ్చితంగా లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు అని.. తెలుగు క్లాసెస్ కి వెళ్తుంది ఈ భామ. త్వరలోనే తెలుగులో మాట్లాడుతాను అంటూ ప్రతిజ్ఞ చేస్తుంది మాళవిక మోహనన్. ఈమె పట్టుదల చూస్తుంటే రాజా సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పక్కా తెలుగులోనే మాట్లాడేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ తో వర్క్ చేయడం గురించి కూడా మనసులో మాట బయట పెట్టింది మాళవిక. ఆయన లాంటి గొప్ప వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలని.. ఈ విషయంలో తాను చాలా లక్కీ అని చెప్పుకొచ్చింది మాళవిక. అంతేకాదు షూటింగ్ సమయంలో ప్రభాస్ తమని చూసుకునే విధానం చూసి ఆయనతో ప్రేమలో పడిపోయాను అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రభాస్ లాంటి మంచి వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడు చూడలేదని.. ఆయనతో తెలియకుండానే ప్రేమలో పడిపోయానని.. ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయాను అంటూ చెప్పుకొచ్చింది.
కేవలం మాళవిక మాత్రమే కాదు నిధి అగర్వాల్ కూడా ఇదే మాట చెబుతుంది. ఈ సినిమాకు ముందు కల్కిలో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న దిశ పటానీ కూడా పొగడ్తల వర్షం కురిపించింది. ఇక దీపిక పదుకొనే అయితే ప్రభాస్ ఫుడ్ గురించి చెప్పి.. ఇంకో రెండు సినిమాలు ఆయనతో చేస్తే తమకు జీవితంలో జీరో సైజ్ రాదు అంటూ సెటైర్లు వేసింది కూడా. ఆది పురుష్ టైంలో కృతి సనన్ కూడా ప్రభాస్ మీద ప్రశంసల వర్షం కురిపించింది. ఆ టైంలో ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. అందుకే బాలకృష్ణ కూడా ప్రభాస్ తన షోకు వచ్చినప్పుడు సనన్ కావాలా.. శెట్టి కావాలా అంటూ బాగా ఆడుకున్నాడు. సాహో సినిమా చేస్తున్నప్పుడు శ్రద్ధ కపూర్ కూడా ప్రభాస్ ను మునగచెట్టు ఎక్కించింది. ఎలా చూసుకున్నా కూడా ప్రభాస్ తో ఒక్కసారి నటిస్తే చాలు ఆ హీరోయిన్ జీవితం మొత్తం ఆయనను అసలు మర్చిపోదు. తన మర్యాదలతో అలా చంపేస్తున్నాడు రెబెల్ స్టార్. అసలే భీమవరం రాజులు కదా.. అందుకే ఎవరొచ్చినా కూడా ఫుడ్ తో చంపేస్తున్నాడు. ఆయన పంపించిన ఫుడ్డు ఒకసారి తిన్న తర్వాత ప్రభాస్ పేరు వింటే చాలు చేతులెత్తి దండం పెడుతున్నారు వాళ్ళు.