SSMB29 నుంచి మరో మేజర్ లీక్.. పాపం రాజమౌళి ఎలా తట్టుకుంటాడో..?

నేనిండా మూడేళ్లు సర్వీస్‌లో ఉంటాను.. ఈలోపు నిన్ను రోడ్డు కాదు కదా చిన్న కంకరరాయి కూడా చూడనివ్వను.. నిన్ను ఈ అడవితల్లికి అంకితం చేస్తున్నాను అంటూ జల్సాలో ఓ డైలాగ్ రాసాడు త్రివిక్రమ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2025 | 05:55 PMLast Updated on: Mar 05, 2025 | 5:55 PM

Another Major Leak From Ssmb29 How Will Rajamouli Cope With The Sin

నేనిండా మూడేళ్లు సర్వీస్‌లో ఉంటాను.. ఈలోపు నిన్ను రోడ్డు కాదు కదా చిన్న కంకరరాయి కూడా చూడనివ్వను.. నిన్ను ఈ అడవితల్లికి అంకితం చేస్తున్నాను అంటూ జల్సాలో ఓ డైలాగ్ రాసాడు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ మాటలు మహేష్ బాబుకు సరిగ్గా సరిపోయేలా కనిపిస్తున్నాయి. రాజమౌళితో ఏ ముహూర్తంలో సినిమా ఓకే చేసాడో గానీ అప్పట్నుంచీ బయట కనిపించడమే మానేసాడు బాబు. పాపం మా బాబు ఎలా ఉన్నాడో అంటూ మహేష్ ఫ్యాన్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే రాజమౌళి సినిమా కాబట్టి రెండు మూడేళ్ళ తర్వాతైనా ఇండస్ట్రీ హిట్ వస్తుందనే సంతోషంలో ఇప్పుడున్న కష్టాన్ని సర్దుకుపోతున్నారు. తాజాగా SSMB29 షూటింగ్ గురించి మేజర్ అప్‌డేట్స్ బయటికి వచ్చాయి. అయినా ఈ సినిమా గురించి రాజమౌళి ఎంత దాచిపెట్టాలని చూసినా.. ఏదో విధంగా న్యూస్ వస్తూనే ఉంది.

మొన్న జిమ్ వీడియో లీక్ అవ్వడంతో బాగా డిసప్పాయింట్ అయ్యాడు జక్కన్న. అయితే తాజాగా మరో మేజర్ అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రాబోయే మూడు వారాలు ఈ చిత్ర షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చెప్పే న్యూస్ ఇది. దాంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. షూట్ జరుగుతుందనే మాటే గానీ ఇప్పటి వరకు ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు.. ఇక టీం కూడా హైదరాబాద్ దాటి బయటికి వెళ్లింది లేదు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అల్యూమీనియం ఫ్యాక్టరీలోనూ చిత్రీకరించాడు రాజమౌళి. అక్కడే ప్రత్యేకంగా సెట్ కూడా వేసారు. తాజాగా ఫస్ట్ టైమ్ SSMB29 కోసం హైదరాబాద్ దాటారు యూనిట్. SSMB29 యూనిట్ అంతా ప్రస్తుతం ఒడిషాలో ఉన్నారు. అక్కడేం లొకేషన్స్ ఉన్నాయ్ బ్రో అనుకోవచ్చు కానీ అక్కడే అద్భుతమైన లొకేషన్స్ పట్టుకున్నాడు జక్కన్న. రాబోయే మూడు వారాల పాటు ఈ చిత్ర మేజర్ సీక్వెన్సులు అన్నీ అక్కడే జరగనున్నాయి.

అక్కడి డియోమాలి, తలమాలి, కాళ్యమాలి అటవీ ప్రాంతాల్లో 23 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసారు రాజమౌళి. కోలాబ్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరగనుంది. ఇప్పటికే రాజమౌళి ఒడిషా హోటల్‌లో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు సహా చిత్రయూనిట్ అంతా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో SSBM29లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం నటిస్తున్నారంటూ తెలుస్తుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. హాలీవుడ్ స్టైల్‌లో టాకీ పార్ట్ ఏడాదిలోపే పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ టైమ్ తీసుకోవాలని చూస్తున్నారు జక్కన్న. అన్నీ కుదిర్తే 2027లో SSMB29 విడుదల కావడం ఖాయం.