ప్రభాస్ తో మరో సెన్సేషనల్ డైరెక్టర్.. వర్కౌట్ అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ ఫసక్..!
ఎన్ని సినిమాలు చేస్తావ్ స్వామి.. ఇంకెన్ని సినిమాలు చేస్తావు..! ప్రభాస్ దూకుడు చూసిన తర్వాత అభిమానులు ఆయనను అడుగుతున్న ప్రశ్న ఇదే.

ఎన్ని సినిమాలు చేస్తావ్ స్వామి.. ఇంకెన్ని సినిమాలు చేస్తావు..! ప్రభాస్ దూకుడు చూసిన తర్వాత అభిమానులు ఆయనను అడుగుతున్న ప్రశ్న ఇదే. మిగిలిన స్టార్ హీరోలు ఒకసారి ఒక సినిమా చేయడానికి నానా తంటాలు పడుతుంటే.. ఈయన మాత్రం ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అసలు ఆయన దూకుడు చూస్తుంటే ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. అన్ని సినిమాలకు ఒకేసారి డేట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో కూడా కేవలం ప్రభాస్ కు మాత్రమే నచ్చిన ప్రతి కథకు.. ప్రతి దర్శకుడికి ఓకే చెప్తూనే ఉన్నాడు రెబల్ స్టార్. ముందు కథ ఫైనల్ చేస్తున్నాడు.. ఆ తర్వాత సినిమా ఓకే అయిపోతుంది.. ఆ తర్వాత దర్శకులకు టోకెన్స్ ఇచ్చి పంపిస్తున్నాడు.. మీ నెంబర్ వచ్చినప్పుడు వచ్చి నాతో సినిమా చేసుకొని వెళ్లిపోండి అన్నట్టు ఉంది ఇప్పుడు ప్రభాస్ దర్శకుల పరిస్థితి.
ప్రస్తుతం మారుతి రాజా సాబ్ సినిమాతో పాటు.. హను రాఘవపూడితో ఫౌజీతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్.. కల్కి 2… సలార్ 2 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇన్ని సినిమాలు లైన్లో ఉండగానే తాజాగా మరో సినిమా కూడా ప్రభాస్ ఓకే చేసినట్టు తెలుస్తుంది. అది కూడా దిల్ రాజు నిర్మాణంలో..! గతంలో దిల్ రాజు నిర్మాతగా మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేశాడు ప్రభాస్. తాజాగా ఇదే కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనికి దర్శకుడు ఎవరో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఆయనెవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్..! నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ కాంబినేషన్ గురించి చర్చ బాగా జరుగుతుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేస్తున్న గురూజీ.. ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్ కలవడానికి దాదాపు మూడు నాలుగేళ్ళు పడుతుంది. ఆ లోపు బన్నీ సినిమా కూడా పూర్తి చేసుకుని వస్తాడు త్రివిక్రమ్. ఈ గ్యాప్ లో తను ఒప్పుకున్న సినిమాలు కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. ఒకవేళ అన్ని కుదిరి ఈ ఇద్దరి కాంబినేషన్ వర్కౌట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర పూనకాలు పుట్టించడం ఖాయం. ఎందుకంటే ప్రభాస్ ఇమేజ్ కు.. త్రివిక్రమ్ మ్యాజికల్ రైటింగ్ తోడైతే రికార్డు షేపులు మారిపోతాయి. అదే జరగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.