Pushpa 2 : సెకండ్ సాంగ్ రెడీ

మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పుష్ప.. పుష్ప.. సాంగ్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2024 | 11:44 AMLast Updated on: May 08, 2024 | 11:44 AM

Another Song From Pan India Movie Pushpa 2 Is Going To Be Released

 

 

 

మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పుష్ప.. పుష్ప.. సాంగ్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప.. పుష్ప.. సాంగ్ (Pushpa Song) మాత్రమే వినబడుతోంది. పుష్పగాడి దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. పుష్ప.. పుష్ప.. అంటూ ఊగిపోతున్నారు జనాలు. బన్నీ సిగ్నేచర్ స్టెప్స్‌ వేస్తూ రీల్స్‌తో రచ్చ చేస్తున్నారు. షూ డ్రాప్ స్టెప్, ఛాయ్ స్టెప్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సాంగ్.. మొత్తంగా ఆరు భాషల్లో 50 మిలియన్స్ వ్యూస్ అందుకున్న ఫాస్టెస్ట్ సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఫస్ట్ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది కాబట్టి.. సెకండ్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్‌గా పుష్ప 2 నుంచి రెండో పాటను జూన్ నెలలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మే 1న ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి.. నెల రోజుల గ్యాప్‌లో ఈ పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఆగష్టు 15న పుష్ప2 (Pushpa 2) రిలీజ్ కానుంది. కాబట్టి సెకండ్ సాంగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్. ఇక్కడి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాను సుకుమార్ (Sukumar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ వారు చాలా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే భారీ బిజినెస్ జరుపుకుంటున్న పుష్ప 2.. ఖచ్చితంగా వెయ్యి కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈసారి పుష్పరాజ్ (Pushpa Raj) బాక్సాఫీస్ రచ్చ ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.