Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ వీడియో..

స‌లార్ (Salaar) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత.. యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star) ప్రభాస్‌ నుంచి రాబోతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) .. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీని నాగ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2024 | 10:10 AMLast Updated on: Feb 25, 2024 | 10:10 AM

Another Surprise Video For Darling Fans

స‌లార్ (Salaar) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత.. యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star) ప్రభాస్‌ నుంచి రాబోతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) .. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీని నాగ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ (Bollywood) బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ కీలక పాత్రలు చేస్తుండడం మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మే 9న విడుదల కానుంది. కాగా.. ఇప్పటికే ఈ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌ సోషల్ మీడియాను హోరెత్తించగా… ఈ మూవీకి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది.

స్క్రాచ్ ఎపిసోడ్ -3 : గ‌న్స్ రీ-ఇమాజినింగ్ అంటూ.. కల్కి మూవీ నుంచి మూవీ టీమ్ ఒక వీడియో విడుద‌ల చేసింది. ఈ వీడియోలో కల్కి సినిమాలో వాడే గ‌న్స్ ఎలా రూపొందించారు అనేది చూపించారు. అంత‌కుముందు ఈ సినిమాకు సంబంధించి సినిమాలో వాడే వాహనాల టైర్ల గురించి కూడా ఒక వీడియోను వదిలారు. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోలు డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చాయి. మ‌రోవైపు ఈ మూవీ ట్రైల‌ర్‌ను ఏప్రిల్ 1న విడుద‌ల చేయ‌నున‌ట్లు మేకర్స్ ప్రకటించారు.

ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో రెడీ అవుతోన్న కల్కి 2898 ఏడిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని మేకర్స్ ముందు నుంచీ పాన్ వరల్డ్ మూవీగానే ప్రమోట్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. శ్రీమహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కిగా ఈ మూవీలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. భవిష్యత్తు ప్రపంచంలో జరిగే కథగా ఈ సినిమా ఉండబోతోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ నటిస్తూ ఉండటం విశేషం. విజువల్ వండర్ గా ఈ మూవీని నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నారు. ఇందుకోసం మరో ప్రపంచాన్ని సృష్టించారు. డిఫరెంట్ టైం లైన్ లో జరగబోతోన్న ఈ మూవీని నాగ్ అశ్విన్ ఎలా డీల్ చేస్తాడో.. ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఎంత వరకు రీచ్ అవుతాడో చూడాల్సిందే..