యాక్టర్‌ దర్శన్‌ కేసులో మరో ట్విస్ట్‌ ఆ హీరోయిన్‌ జీవితం నాశనం

కన్నడ యాక్టర్‌ దర్శన్‌ తన అభిమానినే హత్య చేయించిన వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత హాట్‌ టాపిక్‌గా మారిందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. తన ప్రేయసిని కామెంట్‌ చేశాడన్న కారణంతో అభిమానిని అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు దర్శన్‌. ఈ కేసులో ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2024 | 01:59 PMLast Updated on: Dec 02, 2024 | 1:59 PM

Another Twist In The Actor Darshan Case Ruins The Heroines Life

కన్నడ యాక్టర్‌ దర్శన్‌ తన అభిమానినే హత్య చేయించిన వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత హాట్‌ టాపిక్‌గా మారిందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. తన ప్రేయసిని కామెంట్‌ చేశాడన్న కారణంతో అభిమానిని అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు దర్శన్‌. ఈ కేసులో ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు. కానీ దర్శన్‌కు సంబంధించిన పాత లవ్‌ వ్యవహారం ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. తన స్వార్థంకోసం ఓ స్టార్‌ హీరోయిన్‌ జీవితాన్ని దర్శన్‌ నాశనం చేశాడు. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌ అందుకున్న హీరోయిన్‌ తను. తక్కువ టైంలోనే మంచి స్టార్‌డం సంపాదించుకున్న బ్యూటీ తను. కానీ ఆమె చేసిన ఒకే ఒక్క తప్పు.. ఆమెను ఇండస్ట్రీకి దూరం చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే కష్టపడి సంపాదించుకున్న స్టార్‌డం మొత్తం పోయేలా చేసింది. ఆమే హీరోయిన్‌ నిఖితా తుక్రాల్‌ 2002లో హాయ్‌ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన నిఖితా.. చాలా తక్కువ టైంలోనే మంచి స్టార్‌డం సంపాదించుకుంది.

కొంత కాలంలోనే తెలుగు కుర్రాళ్ల డ్రీమ్‌గర్ల్‌గా మారిపోయింది. కానీ కెరీర్‌ పీక్స్‌లో ఉన్న టైంలో నిఖితా కన్నడ యాక్టర్‌ దర్శన్‌తో ప్రేమలో పడింది. కానీ అప్పటికే దర్శన్‌కు పెళ్లి అయ్యింది. ఆ విషయం తెలిసి కూడా దర్శన్‌తో ప్రేమలో కొనసాగింది నిఖితా. కొన్ని రోజులకు ఈ వ్యవహారం దర్శన్‌ భార్య విజయలక్ష్మికి తెలిసింది. దీంతో ఆమె నిఖితకు వార్నింగ్‌ ఇచ్చింది. అప్పటి నుంచి భార్యకు తెలియకుండా సీక్రెట్‌గా నిఖితను కలవడం మొదలుపెట్టాడు దర్శన్‌. వీళ్ల వ్యవహారం ముదరడంతో విజయలక్ష్మి నిఖిత మీద పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చింది. ప్రేయసి మీద పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చిందన్న కోపంతో భార్యను హింసించడం మొదలు పెట్టాడు దర్శన్‌. దీంతో విజయలక్ష్మి దర్శన్‌ మీద కూడా కేసు పెట్టింది. ఈ కేసుతో కొన్ని రోజుల పాటు దర్శన్‌ జైలుకు కూడా వెళ్లాడు. ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌ అవ్వడంతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నిఖితను మూడేళ్లు బ్యాన్‌ చేసింది. ఆ బ్యాన్‌ ముగిసిన తరువాత కూడా నిఖితకు ఆఫర్స్‌ రాలేదు. దీంతో పూర్తిగా ఫిలిం ఇండస్ట్రీకి దూరమయ్యింది నిఖితా తరువాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలను వదిలేసింది. స్టార్‌ హీరోయిన్‌గా కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన టైంలో ఆమె చేసిన ఈ తప్పు అసలు ఆమెకు సినీ జీవితమే లేకుండా చేసింది.