ముంచి”నాశనం” చేస్తున్నారు.. మహేశ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలర్ట్…
టాలీవుడ్ లో ముగ్గురు హీరోల సినిమాలు వస్తే పాపం, యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ ఓరేంజ్ లో ఉంటుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ దాడి ఊహాతీతం.

టాలీవుడ్ లో ముగ్గురు హీరోల సినిమాలు వస్తే పాపం, యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ ఓరేంజ్ లో ఉంటుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ దాడి ఊహాతీతం. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కి ముందు, రిలీజ్ అయ్యాక, ఆతర్వాత హిట్ మెట్టెక్కాక, ఇలా స్టేజ్ బై స్టేజ్ యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ జరుగుతూనే ఉంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలకు కూడా యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ వెరీ వెరీ కామన్. ఇదంతా మొన్నటి వరకు ట్రాష్ అనుకున్నారు. కాని ఇది నిజంగా ఉందని తేల్చాడు అక్కినేని హీరో నాగచైతన్య. నిజంగానే మరో హీరో నాశనమయ్యేందుకు కోట్లు కుమ్మరించి నెగెటీవ్ పీఆర్ ని పెట్టుకుంటున్నారట. ఇది మొన్నటి వరకు అతిశయోక్తి.. కాని ఇప్పుడు ఇది భయంకరమైన నిజం అని నాగచైతన్య తేల్చాడు. అంతగా తనకేం తెలిసింది..? అంటే పదేళ్లుగా ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్ సినిమాలకు జరుగుతున్న యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ నిజమేనా? టేకేలుక్
పొరుగు హీరో నాశనం అవ్వాలంటే, వాళ్ల సినిమా రిలీజ్ కాకముందే పోయిందని, లేదంటే రిలీజ్ కాగానే ఫ్లాపైందని మాటల తూటాలు పేల్చాలి.. లేదంటే ఆసినిమా ట్రైలర్ లోడైలాగ్స్ కి దిక్కుమాలిన నెగెటీవ్ పంచ్ ల కామెడీ సీన్లను యాడ్ చేసి ట్రోల్ చేయాలి. మరీ కాదంటే సినిమా రిలీజ్ రోజున మూవీ చత్తగా ఉందని ఒకడు, లేదా మామూలుగా లేదు ప్రపంచం షేక్ అవుతుందని మరీ అతిగా పొగిడి అలా కూడా సినిమా పరువుతీయాలి..
ఇవీన్న కండీషన్లు… వీటని ఫాలో అయ్యి సినిమాను చీల్చి చెండాడితే, ఇంత… నెగెటీవ్ గాట్వీట్లు పెడితే మరింత.. ఇలా డబ్బులిచ్చి పక్క హీరోల సినిమాలను గబ్బు పట్టిస్తున్నారట. ఇదేదో మొన్నటి వరకు ఫ్లాప్ మూవీల మీద దర్శక నిర్మాతలు చేసుకుంటున్న కవరింగ్ అనుకున్నారు. కాని అక్కినేని నవమన్మథుడు నాగచైతైన్య మాటలతో అంతా షాక్ అవుతున్నారు
మార్కెట్ లో నెగెటివిటీ చూశాం, కాని డబ్బిచ్చి మరి పక్క హీరోల మీద చెడు వార్తలు ప్రచారం చేయటం, సినిమాలు దొబ్బాయని నెగెటివిటీని స్ప్రెడ్ చేయించటం, కొత్తరకం పీఆర్ పని. ఒకప్పుడు పీఆర్ అంటే హీరోలు, జర్నలిస్టులకు మధ్య బ్రిడ్జ్ లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు ఉండేవాల్లు.. కాని ఇప్పుడు పీఆర్ అంటే పక్క హీరో రాతని తలరాతని నాశనం చేయ్ అనేలా తయారైందట
నిజానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా ఏదొచ్చినా ఇలానే నెగెటివ్ వార్తలు వినిపిస్తాయి. దేవర అయితే రిలీజ్ కి ముందే పోయిందన్నారు. రిలీజ్ అయ్యాక డిజాస్టర్ అన్నారు. 670 కోట్ల వసూళ్లొచ్చాక మాత్రం నార్త్ ఇండియానే కాపాడిందని సన్నాయి నొక్కులు నొక్కారు. అలా సోషల్ మీడియాలో తనకే కాదు మహేశ్ బాబు మూవీలకు కూడా భారీగా నెగెటివిటీ కనిపిస్తుంది
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలు వస్తున్నాయంటే చాలు ఫ్లాప్ అంటూ ప్రచారం కామన్. తన సరిలేరు నీకెవ్వరు టైంలో జరిగినంత నెగెటీవ్ ప్రచారం, మహేశ్ చేసిన మరేమూవీకి జరగలేదు… ఇక ప్రభాస్ కైతే బాహుబలి మొన్నటి కల్కీ వరకు నెగెటీవ్ ప్రచారం లేకుండా సింగిల్ సినిమా రిలీజ్ కాలేదు. ఎన్టీఆర్, ప్రభాస్ కైతే ఇప్పుడు పాన్ ఇండియాలెవల్లో నెగెటీవ్ ప్రచారం చేసే పీఆర్ బ్యాచ్ ఎటాక్స్ కామనైపోయాయి. నాగచైతన్య అంత ఖచ్చితంగా ఇలాంటి నెగెటీవ్ పీఆర్ వర్క్ చేస్తోందని తెలిసిందంటే, పక్కాగా మ్యాటర్ లోక్లారిటీ వచ్చినట్టుంది.
తన తండేల్ మూవీకే ఈ నెగెటివిటీని చూశాడంటే, ఆ బ్యాచ్ ఎవరో తనకి అర్ధమయ్యి ఉంటుంది…కాని అక్యురేట్ గా వాళ్లెవరో మాత్రం తను చెప్పలేదు… సో బాలీవుడ్ లో లానే పక్క హీరోని నాశనం చేసే నెగెటీవ్ ప్రచారం, అందుకోసం కొన్ని గ్రూపులు పనిచేయటం ఇక్కడ మొదలైందంటే, ఇక టాలీవుడ్ కూడా బాలీవుడ్ లా బొక్కబోర్లా పడాల్సిందే.