Anupama Parameswaran : అనుపమ వాట్ నెక్స్ట్
మలయాళీ బ్యూటీ (Malayali Beauty) అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. అలాగే అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మళయాళ (Malayali) మూవీ ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను.. త్రివిక్రమ్ తెరకెక్కించిన అ.. ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Anupama What Next
మలయాళీ బ్యూటీ (Malayali Beauty) అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. అలాగే అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మళయాళ (Malayali) మూవీ ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను.. త్రివిక్రమ్ తెరకెక్కించిన అ.. ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఏనాడు కూడా హద్దులు దాటలేదు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తు వచ్చింది. కానీ రౌడీ బాయ్స్ సినిమాతో మెల్లిగా తన రూట్ మార్చుకుంది.
అక్కడి నుంచి టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమా వరకు ఓ రేంజ్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది అనుపమా. రీసెంట్‌గా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాలో లిల్లీ పాత్రలో అనుపమను చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఇన్నేళ్ల కేరీర్లో ఎప్పుడూ కూడా ఇంత హాట్‌గా కనిపించలేదు అను. హోమ్లీ ఇమేజ్ ఉన్నఅనుపమ టిల్లు స్క్వేర్‌లో లిప్ లాక్స్, క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఇదే ఇప్పుడు అమ్మడిని కష్టాల్లో పడేసినట్టుగా చెబుతున్నారు. టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత అనుపమ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. దీంతో అమ్మడికి వరుసగా బోల్డ్ క్యారెక్టర్ల ఆఫర్లే వస్తున్నట్లు సమాచారం.
దీంతో.. అనుపమ కాస్త కన్ఫ్యూజన్లో పడినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలనే డైలమాలో ఉందట. కంటిన్యూగా గ్లామర్ రోల్స్ చేయాలా లేక ఈ ఇమేజ్ నుంచి బయటపడేందుకు మళ్లీ డీసెంట్ రోల్స్ చేయాలా అనే ఆలోచనలో ఉందట. అందుకే ఇప్పటి వరకు మరో కొత్త సినిమా సైన్ చేయలేదట అనుపమా. మరి లిల్లీ ఏం చేస్తుందో చూడాలి.