జక్కన్న సెంటిమెంట్ సల్లగుండ, మహేష్ కు అమ్మగా అనుష్క

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే... చాలు ఏ వార్త వచ్చినా జనాలకు ఓ రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. సినిమా షూట్ సమయంలోనే సినిమాపై చర్చలు పీక్స్ కి వెళ్తాయి. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ఆయనది. అందుకే ఏ సినిమా చేసినా సరే అది సూపర్ హిట్ అవుతూ ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 07:27 PMLast Updated on: Sep 16, 2024 | 7:27 PM

Anushka Acting As A Mother In Mahesh Movie

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే… చాలు ఏ వార్త వచ్చినా జనాలకు ఓ రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. సినిమా షూట్ సమయంలోనే సినిమాపై చర్చలు పీక్స్ కి వెళ్తాయి. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ఆయనది. అందుకే ఏ సినిమా చేసినా సరే అది సూపర్ హిట్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్కంటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు ఆయన. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక షూటింగ్ కూడా ఇప్పుడు మొదలవుతోంది.

ఈ సమయంలో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎవరు నటిస్తారు ఏంటీ అనే దానిపై పెద్ద చర్చలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అనుష్కని కూడా తీసుకుంటున్నాడు జక్కన్న. మహేష్ బాబుకి అమ్మగా ఆమెను తీసుకుంటున్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు అమ్మగా ఆమె బాగా నటించింది. ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేయాలని జక్కన్న భావిస్తున్నాడు. ఆమె పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్. స్వీటి కూడా అందుకు ఒప్పుకుంది.

గతంలో మహేష్ బాబుతో కలిసి ఖలేజా సినిమాలో నటించింది అనుష్క. అక్కడ హీరో హీరోయిన్లుగా వీళ్ళ కాంబినేషన్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి మరి. గత కొన్నాళ్ళుగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనేది కూడా చాలా మందికి తెలియదు. బరువు కూడా భారీగా పెరిగింది. పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఆమె ఉంటే మాత్రం సినిమాకు హైప్ భారీగా వస్తుంది. అందుకే జక్కన్న కూడా అనుష్క ని ఈ సినిమాలో తీసుకోవాలని భావిస్తున్నాడు. ఆమె రేంజ్ కి తగ్గ పాత్రనే ఇవ్వాలని భావిస్తున్నాడు. ఈ సినిమా మల్టీ స్టారర్ అని అంటున్నాయి సినీ వర్గాలు.