అనుష్క వెయిట్ తగ్గదా ఇక..మనమే అడ్జెస్ట్ ఐతే పొలా

అనుష్క వెయిట్ తగ్గిందా? లేదా? అని పట్టించుకోవడం మానేశారు అభిమానులు. బొమ్మాళీ ఇక తగ్గేది లేదని డిసైడ్‌ అయిపోయారు. ఈ అమ్మడి పర్సనాలిటీ గురించి మాట్లాడడం మానేసిన జనాలు.. అనుష్క ఏంటి డిఫరెంట్‌గా కనిపిస్తోందంటున్నారు. ఫేస్‌లో ఛేంజ్‌ వచ్చిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2023 | 04:30 PMLast Updated on: Mar 27, 2023 | 4:30 PM

Anushka Latest Movie Song

అనుష్క సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించి నాలుగేళ్లయింది. సైరా నరసింహారెడ్డిలో గెస్ట్‌ అపీరియన్స్ ఇవ్వడం తప్ప.. బిగ్‌స్క్రీన్‌పై కనిపించలేదు. భాగమతి తర్వాత నటించిన నిశ్శబ్దం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఈ ఓటీటీ మూవీ తర్వాత రెండేళ్లు ఆఫర్స్‌ రాకుండా ఖాళీగా గడిపేసిన బొమ్మాళీ.. ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’కు సైన్‌ చేసింది. నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన ఈసినిమాకు మహేశ్‌బాబు దర్శకుడు.
అనుష్క వెయిట్‌ గురించి అభిమానులే కాదు.. ఎవరూ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. 8 ఏళ్లుగా తగ్గని బొమ్మాళీ వెయిట్ లాస్‌ అవుతుందన్న నమ్మకం లేదు. మిస్‌ శెట్టి గ్లిమ్స్‌ రిలీజ్‌కు ముందే.. అనుష్క మహశివరాత్రి సందర్భంగా గుడికి వస్తే.. బొద్దుగానే కనిపించింది. గ్లిమ్స్‌లోనే కాదు.. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన సాంగ్‌లోనూ ఓవర్‌ వెయిట్‌నే మెయిన్‌టేన్‌ చేయడమే కాదు.. ఫేస్‌లో కూడా షేప్స్‌ మారిపోయాయి. కొత్త అనుష్క కనిపించింది.
వెయిట్‌తోపాటు.. ఫేస్‌లో ఫీచర్స్‌ కూడా మారిపోయాంటున్నారు నెటిజన్లు. సినిమా మొదలై చాలాకాలం అయినా.. ఈమధ్యనే ఒకటీ అర స్టిల్స్‌ బైటపెట్టారు. రీసెంట్‌గా విడుదల చేసిన నో నో సాంగ్‌లో అనుష్క అక్కడక్కడ విజువల్స్‌తో కనిపించింది. మన బొమ్మాళీనేనా? అన్నంత అనుమానం వచ్చేలా షాక్‌ ఇచ్చింది. కొన్ని కొన్ని షాట్స్‌లో కొత్త హీరోయిన్‌లా అనిపించినా..ఒక్కోసారి అనుష్కలా అనిపించకపోయనా.. ఫ్రెష్‌ లుక్‌తో ఆకట్టుకుంది.