Anushka Shetty: పబ్లిక్‌లోకి రావడానికి ఇబ్బంది పడుతున్న అనుష్క.. సమస్యేంటి..?
మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్‌లో కనిపించకపోయేసరికి అనుష్కకు ఏమైంది..? ఎందుకు బైటకి రావడం లేదంటూ.. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వెయిట్ తగ్గలేదని, అందుకే బాడీ షేమింగ్ చేస్తారని రావడం లేదా? అనే అనుమానం చాలామందికి వుంది.
Anushka Shetty: అనుష్క మూవీస్‌లో యాక్ట్ చేస్తోందే తప్ప జనంలోకి రాలేకపోతుందా..? లావు తగ్గలేక పోవడంతో పబ్లిక్‌లోకి రావడానికి ఇబ్బంది పడుతోంది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఇప్పుడు మొదటిసారి మలయాళం మూవీలో చేస్తుంది బొమ్మాళి. చాలా గ్యాప్ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో వచ్చి సక్సెస్ చూసింది. ఫామ్‌లోకి వచ్చిన బొమ్మాళీ.. ఓ సీనియర్ స్టార్‌తో జత కడుతోందన్న వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్‌లో కనిపించకపోయేసరికి అనుష్కకు ఏమైంది..? ఎందుకు బైటకి రావడం లేదంటూ.. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
వెయిట్ తగ్గలేదని, అందుకే బాడీ షేమింగ్ చేస్తారని రావడం లేదా? అనే అనుమానం చాలామందికి వుంది. సినిమాలో బాడీ సన్నగా వున్నా.. టెక్నాలజీతో తగ్గించారంటున్నారు. ఫేస్ మాత్రం టాయ్‌లా వుంది. అనుష్క ఔటాఫ్ స్టేషన్. అందుకే రావడం లేదంటూ హీరో నవీన్.. చిత్ర యూనిట్ కవర్ చేస్తూ వస్తున్నారు. ఆమధ్య వీడియో రిలీజ్‌లో థ్యాంక్స్ చెప్పిందే తప్ప.. సక్సెస్‌మీట్‌లోనూ కనిపించలేదు. అనుష్క వెయిట్ తగ్గిందా..? పెరిగిందా..? అనే సంగతి పక్కన పెడితే, బంపర్ ఆఫర్లు రావడం చూస్తుంటే లావుగా వుంటే ఛాన్సులు ఎందుకిస్తారు అనిపిస్తోంది. వెయిట్ తగ్గడంతోనే ఛాన్సులు క్యూ కడుతున్నాయనిపిస్తోంది. స్టాలిన్ సినిమాలో స్పెషల్ అపీరియన్స్ ఇచ్చిన అనుష్క.. చిరంజీవి హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందన్న వార్త బైటకొచ్చింది. బింబిసార ఫేం వశిష్ట డైరెక్ట్ చేసే మూవీలో అనుష్కను తీసుకుంటున్నారన్న టాక్ అయితే నడుస్తోంది.
బొమ్మాళీ సన్నబడడానికి భారీగా కసరత్తులు చేస్తోందని, బైటకు రాకుండా ఒకేసారి వచ్చి సర్‌ప్రైజ్ చేస్తుందని సన్నిహితులు చెబుతున్నారు. 18 ఏళ్ల కెరీర్‌లో అనుష్క ఇప్పటివరకు రెండు భాషల్లో మాత్రమే నటించింది. తెలుగు, తమిళంలో తప్ప మరో లాంగ్వేజ్‌లో నటించని బొమ్మాళీ మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కథనార్’ అనే మలయాళ మూవీ చేస్తోంది. అరుంధతి మాదిరి పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుంది. అనుష్క డెబ్యూ మలయాళ మూవీ కథనార్ మొదటి భాగం 2024లో రిలీజ్ అవుతోంది. రోజిన్ థామస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 14 భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది.