Anushka: త్వరలో సినిమాలకి అనుష్క గుడ్ బై
అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పబోతోందా..? మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమానే తన కెరీర్ కి లాస్ట్ ప్రాజెక్టా?.సడన్ గా ఈ మ్యాటర్ టాలీవుడ్ లో హైలెట్ అవ్వడానికి కారణమేంటి? దాని వెనుకున్న మ్యాటర్ ఏంటి అని ఇండస్ట్రీ లో చర్చ జరుగుతోంది.

Anushka will say goodbye to movies soon Some movie celebrities say
అనుష్క శెట్టి.. కన్నడ నుంచి టాలీవుడ్ కి ట్రావెల్ అయినా బ్యూటీ. కెరీర్ బిగినింగ్ లో గ్లామర్ పాత్రలకే పరిమితమైనా.. తర్వాత రూట్ మార్చింది. అరుంధతి తో ట్రెండ్ బెండ్ తీసింది. బాహుబలి, భాగమతి తో నేషనల్ వైడ్ గా మార్కెట్ క్రియేట్ చేసుకుంది. హీరో లేకపోయినా తన స్టార్ డంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నిరూపించింది.
ఫుల్ స్వింగ్ లో ఉన్న అనుష్క కెరీర్ ని ఒక్కసారిగా తలకిందులు చేసింది సైజ్ జీరో. ఈ సినిమాలో తన పాత్ర కోసం బరువుని భారీగా పెంచేసుకుంది. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది.దీంతో సైలెంట్ అయిన అనుష్క షార్ట్ గ్యాప్ తర్వాత నిశ్శబ్థం అనే సినిమా చేస్తే రిజల్ట్ సౌండ్ లేకుండా పోయింది. దీంతో ఆడ్రస్ లేకుండా పోయినా అనుష్క ఇప్పుడు నవీన్ పొలిశెట్టి మూవీ తో మళ్లీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్దం కానుంది.
మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఇద్దరు బడా డైరెక్టర్స్ ఈ బ్యూటీకి కత్తిలాంటి కథలు చెబితే సింపుల్ గా రిజక్ట్ చేసిందట.లేడీ ఓరియెంట్ సినిమాలకు సైతం తను కమిట్ అవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు సినీ పెద్దలు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం అనుష్క అభిమానులకు బాధాకరం.