అనుష్క పెళ్లి ఫిక్స్, పెళ్లి కొడుకు అతడే, పెళ్లి డేట్ కూడా ఫిక్స్…?
సౌత్ ఇండియన్ సినిమాలో పెళ్ళిళ్ళ సందడి పీక్స్ లో ఉంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, సింగర్లు అందరూ పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ అనుష్క కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దమైంది.
సౌత్ ఇండియన్ సినిమాలో పెళ్ళిళ్ళ సందడి పీక్స్ లో ఉంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, సింగర్లు అందరూ పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ అనుష్క కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దమైంది. ఆమె పెళ్లి విషయంలో ఏ వార్త వచ్చినా సరే అభిమానులు పండగ చేసుకుంటూ ఉంటారు. దాదాపు పదేళ్ళ నుంచి ఆమె పెళ్లి పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ను ఆమె వివాహం చేసుకుంటుంది అంటూ ప్రచారం కూడా జరిగింది. అలాగే అనుష్క ఒక డాక్టర్ ను వివాహం చేసుకుంటుందని ఓ రూమర్ షికారు చేసింది.
ఇక ఇప్పటికే పెళ్లి నిశ్చయమైందని నిశ్చితార్ధం త్వరలో జరగనుంది అని ఐదేళ్ల క్రితం కొన్ని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోతుందని… అలాగే అమెరికా వెళ్లి సెటిలైపోయే ఆలోచనలో ఉంది అని ఇప్పటికే ఎన్నారై తో ఆమె ప్రేమలో ఉంది అంటూ మరో వార్త కూడా వైరల్ అయింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో ఒకరిని ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం కూడా చేశారు. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా నిజం కాదు అనేది స్లోగా క్లారిటీ వచ్చింది.
కాని ముఖ్యంగా ప్రభాస్ తో ఆమె వివాహం కచ్చితంగా జరగబోతుంది అంటూ ప్రచారం చాలా వరకు జరిగింది. కాని దీనిపై ఇరువురు ఏ విధమైన క్లారిటీ ఇవ్వలేదు. ఓ వైపు ప్రభాస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దాదాపు 8 సినిమాలను లైన్ లో పెట్టాడు ప్రభాస్. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఆటో కన్నడ సినిమాలో అలాగే ఇటు తెలుగు సినిమాలో ఓ న్యూస్ షికారు చేస్తోంది. అనుష్క కర్ణాటక కు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్న వ్యక్తితో ఆమె వివాహం నిశ్చయమైందట.
వయసు పెరిగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె వివాహం విషయంలో ఇక ఆలస్యం చేయవద్దు అనే భావనలో ఉన్నారని అనుష్క కూడా పెళ్లి చేసుకుని సినిమాలు ఏమైనా ఉంటే తర్వాత చేయాలని భావిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. సదరు వ్యాపారవేత్తకు బెంగళూరు, హైదరాబాద్ అలాగే అమెరికాలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని, దాదాపు ఇద్దరి మధ్య ఐదేళ్ల పరిచయం ఉందని అయితే 2023 నుంచి వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.