ఫోక్సో చట్టం గురించి ఐడియా ఉందా..? నాని కొత్త సినిమా కథ ఇదే..!
నటుడిగా అయినా, నిర్మాతగా అయినా నాని ఎంచుకునే కథల మీద ప్రేక్షకులకు చాలా నమ్మకం ఉంది. ఆయన ఒక సినిమా ఓకే చేశాడు అంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుందని నమ్మకం అందరిలోనూ కలిగించాడు నాచురల్ స్టార్.

నటుడిగా అయినా, నిర్మాతగా అయినా నాని ఎంచుకునే కథల మీద ప్రేక్షకులకు చాలా నమ్మకం ఉంది. ఆయన ఒక సినిమా ఓకే చేశాడు అంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుందని నమ్మకం అందరిలోనూ కలిగించాడు నాచురల్ స్టార్. ప్రస్తుతం ఆయన కోర్ట్ అనే సినిమా నిర్మిస్తున్నాడు. రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కథ గురించి తాజాగా సెన్సేషనల్ విషయం బయటపెట్టాడు నాని. ఈ సినిమా మెయిన్ థీమ్ ఫోక్సో చట్టం అని తెలిపాడు.
ఫోక్సో అంటే మనలో చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. ఇలాంటి ఒక చట్టం ఉందని కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు దీన్ని నేపథ్యంగా చేసుకొని కోర్టు సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు నాని. చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టే చట్టం ఫోక్సో. ఇలాంటి కథతో సినిమా చేయాలి అంటే నిజంగా రిస్కుతో కూడుకున్న పని. ఏమాత్రం అటు ఇటు అయినా కాంట్రవర్సీలకు బలైపోతుంది సినిమా. కానీ నాని మాత్రం తన కోర్టు సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఒక గొప్ప సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నాను అంటున్నాడు.
అందరూ ఊహిస్తున్నట్టుగానే కోర్టు సినిమాలో మైనర్స్ లవ్ స్టోరీ ఉండబోతుంది. చాలా సినిమాలలో బాల నటుడిగా నటించిన రోషన్ ఈ సినిమాతో హీరోగా మారిపోయాడు. సినిమా అంతా మనోడి ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. సెన్సిబుల్ విషయాన్ని మరింత సైన్సిబుల్గా చెప్పబోతున్నాం అంటున్నాడు నాచురల్ స్టార్. మార్చి 14న ఈ సినిమా విడుదల కానుంది. మరి ఇలాంటి రిస్కీ లైన్ తో నాని ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి.