Double Ismart : టీజర్ వచ్చేస్తోంది
ప్రమోషనల్ కంటెంట్ బాగుంటే.. ఆటోమేటిక్‌గా సినిమా పై హైప్ క్రియేట్ అవుతుంది. ఓపెనింగ్స్ టీజర్, ట్రైలర్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే.. ఎంత స్టార్ డైరెక్టర్ అయిన సరే.. టీజర్, ట్రైలర్‌తో మెప్పించాల్సిందే.

Anyone who is a fan of star heroes should watch the first show on the first day.
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎవ్వరైనా సరే.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. కానీ ప్రేక్షకులు సినిమాకు రావాలంటే, హిట్ టాక్ పడాల్సిందే. పైగా ఈ మధ్య కాలంలో కామన్ ఆడియెన్ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలా వద్దా అనేది.. టీజర్, ట్రైలర్సే డిసైడ్ చేస్తున్నాయి.
ప్రమోషనల్ కంటెంట్ బాగుంటే.. ఆటోమేటిక్‌గా సినిమా పై హైప్ క్రియేట్ అవుతుంది. ఓపెనింగ్స్ టీజర్, ట్రైలర్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే.. ఎంత స్టార్ డైరెక్టర్ అయిన సరే.. టీజర్, ట్రైలర్‌తో మెప్పించాల్సిందే. అందులోను పూరి జగన్నాథ్ (Pooji Jagannath) లాంటి దర్శకుడి నుంచి వస్తున్న టీజర్ అంటే.. అందరి కళ్లు దాని పైనే ఉంటాయి.
ఎందుకంటే.. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా కాబట్టి. లైగర్ సినిమాతో కొన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పూరి.. ఎలాగైన సరే సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ (Smart Shankar) సినిమా సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ (Double Ismart ) తెరకెక్కుతోంది. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఇక ఈ సినిమా టీజర్‌ను మే 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడది నిజమేనని అంటున్నారు. ప్రస్తుతం ఈ టీజర్‌కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ఈ టీజర్ విడుదల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఖచ్చింగా ఈ టీజర్‌తో పూరి తన మార్క్ ట్రెండ్ సెట్ చేయడం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు మూవీ లవర్స్. లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత పూరి పెన్ నుంచి వచ్చే వపర్ ఫుల్ డైలాగ్స్ ఎలా ఉంటాయనే ఎగ్జైట్మెంట్ అందరిలోను ఉంది. మరి టీజర్‌తో పూరి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.