దేవరకు ఏపీ హైకోర్ట్ షాక్, కీలక ఆదేశాలు
దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ తో పాటుగా సినిమా జనాల్లో కూడా ఆసక్తి ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో వసూళ్లు కూడా భారీగా ఉండే అవకాశం కనపడుతోంది.
దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ తో పాటుగా సినిమా జనాల్లో కూడా ఆసక్తి ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో వసూళ్లు కూడా భారీగా ఉండే అవకాశం కనపడుతోంది. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు ఉండగానే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుంది దేవర. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని రికార్డులు అమెరికాలో తన ఖాతాలో వేసుకుంది. కర్ణాటక, తమిళనాడుతో పాటుగా బాలీవుడ్ లో కూడా సినిమా కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.
ఇక టికెట్ ధరల విషయానికి వస్తే ఏపీలో తెలంగాణాలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాయి రాష్ట్ర ప్రభుత్వాలు. దీనితో వసూళ్లు కూడా భారీగానే ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ బుకింగ్ మార్కెట్ కూడా భారీగానే జరుగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగి ఉంటే సినిమాకు ఇంకా భారీగా మార్కెట్ జరిగి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. మొదటి రోజు 150 కోట్లు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు సినిమా జనాలు. ఇదిలా ఉంచితే తాజాగా దేవర సినిమాకు ఏపీ హైకోర్ట్ షాక్ ఇచ్చింది.
దేవర సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టికెట్ ధరలను పెంచటాన్ని 10 రోజులకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 14 రోజులు టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమో సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం… పై ఆదేశాలు ఇచ్చింది. హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచటానికి 10 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వాలని కమిటీ రిపోర్ట్ ఉందని పిటిషనర్ కోర్ట్ కి తెలిపారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం… 10 రోజులకు మాత్రమే టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది.