అర్ధరాత్రి 12 నుంచి సునామీ…రోజుకి 4 కాదు.. 6 ఆటలు…

దేవర వచ్చేస్తున్నాడు. అర్ధరాత్రి నుంచే సునామీ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఏపీ ప్రభుత్వం మ్యాన్ ఆఫ్ మాసెస్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చేసింది. అందుకు ఎన్టీఆర్ కూడా ఫిదా అయ్యాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కి ట్వీట్లతో క్రుతగ్నతలు చెప్పేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 21, 2024 | 07:59 PMLast Updated on: Sep 21, 2024 | 7:59 PM

Ap Telangana Good News For Devara

దేవర వచ్చేస్తున్నాడు. అర్ధరాత్రి నుంచే సునామీ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఏపీ ప్రభుత్వం మ్యాన్ ఆఫ్ మాసెస్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చేసింది. అందుకు ఎన్టీఆర్ కూడా ఫిదా అయ్యాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కి ట్వీట్లతో క్రుతగ్నతలు చెప్పేశాడు. ఇంతకి టిక్కెట్ రేట్లు ఏంటంటే 60 నుంచి 130 అని తేలింది.. కాని అవి సింగిల్ స్క్రీన్ తాలూకు ఓల్డ్ థియేటర్ల లెక్కలు.. మరి మల్టీ ప్లెక్స్ లో ఈ రేట్లు మరింత ఘాటెక్కాయా?.. దేవరకి ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే వచ్చే వారం వసూళ్ల వరం కన్ఫామ్ అయినట్టేనా? వెయ్యకోట్ల సునామీ చాలా తేలిగ్గా క్రియేట్ చేసేందుకు దేవరకి అన్నీ అనుకూలిస్తున్నాయా?

దేవర మూవీ రిలీజ్ కి 5 రోజులే టైం ఉంది. ఎగ్జాక్ట్ గా 26 తేదీనుంచే దేవర ప్రివ్యూ సందడి మొదలుకాబోతోంది. 27 కి కూడా ఉదయం కాదు, అర్ధరాత్రి నుంచే సినిమా దండయాత్ర మొదలు కాబోతోంది. ఏపీలో ఏకంగా రోజుకి 6 షోలు వేసుునే వెసులు బాటు ఇచ్చేశారు. కేవలం మొదటి రోజుకే పర్మీషన్ అన్నా, అది మొదటి వారం వరకు కొనసాగేలా ప్రయత్నాలు పెరిగాయి

27 తేదీన ఆరు షోలు, 28 నుంచి ఐదు షోల పర్మీషన్ తోపాటు, మొదటి రోజు అర్ధరాత్రి నుంచే సినిమా షోకి పర్మీషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అదే వారం మొత్తం కొనసాగేలా ఫిల్మ్ టీం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇక మీడియం రేంజ్ నగరాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టిక్కెట్ రేట్లు లోయర్ క్లాస్ 60 రూపాయలు, అప్పర్ క్లాస్ 110 రూపాయల వరకు పెంచుకోవచ్చట. ఇక మల్టీ ప్లెక్స్ లో 135 వరకు పెంచుకునే వీలు కల్పించారు

అంటే అవే టిక్కెట్టు రేట్లని కాదు…రెగ్యులర్ టిక్కెట్ రేట్లకు అదనంగా, 60,110, 135 చొప్పున అదనంగా పెంచి అప్పుడు టిక్కెట్ రేటు ఫైనల్ చేయ్యొచ్చు. అంటే హైద్రబాదులో 250 నుంచి 350 ఉన్న టిక్కెట్ దర, 475 వరకు చేసుకోవచ్చు.. అలానే వరంగల్, వైజాగ్, విజయవాడలాంటి నగరాల్లో సింగిల్ స్క్రీన్ టిక్కెట్లు 225 ఉంటే, మల్టీ ప్లెక్స్ లో 430 వరకు ఉండే ఛాన్స్ ఉంది..

యూఎస్, యూరప్, నార్ ఇండియా, ఇలా అక్కడ రేట్లు ఘాటెక్కతున్నాయి. ఇవన్నీచూస్తే మొదటి రోజు ఓపెనింగ్సే 190 కోట్లు వచ్చే చాన్స్ ఉంది. అదే జరిగితే, 15 నుంచి 25 రోజుల్లో దేవర మూవీ వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టడం చాలా సాధారణ విషయంగానే మారొచ్చు. ఒకవైపు ప్రమోషన్ చేసిన ప్రతీ ఏరియాల్లో రెస్పాన్స్ అదిరిపోతోంది. ట్రోలింగ్స్, కామెంట్స్ చేసే యాంటీ ఫ్యాన్స్ ఎన్ని కుట్రలు చేసినా, దేవర పాటలు, టీజర్, ట్రైలర్ కి రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా దేవర టీంకి బానే సపోర్ట్ చేస్తుండటంతో, అన్నీ మంచి శకునాలే ఎదురౌతున్నాయి.