Mahesh Babu: ప్రభాస్, పవన్ నిర్ణయంతో మహేశ్ బాబుకి పండగ..
సలార్ టీజర్ పేలింది. వెంటనే వచ్చిన ప్రాజెక్ట్ కే గ్లింప్స్ అదిరిపోయింది. దీంతో ఫుల్ పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ గుండెల్లో బాంబు పేలుస్తున్నాడు ప్రభాస్. తన ప్రాజెక్ట్ కే మూవీ జనవరి 12 న కాకుండా మే 9కి వాయిదాకి సై అన్నాడట. పార్ట్ 1, పార్ట్ 2 ఇలా రెండు ప్లాన్ చేస్తే సంక్రాంతికి మొదటి భాగం, దీపావళికి రెండో భాగం అనున్నారు. కాని గ్రాఫిక్స్ వర్క్ వల్ల సమ్మర్ రిలీజ్ కి మనసు మార్చుకోవాల్సి వచ్చిందట.

Apart from Mahesh Babu's Guntur Karam movie, no top hero movie is ready for Sankranti release
జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి లాంటి మూవీలు మే 9కి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయనే కారణంతోనే ఆ సెంటిమెంట్ కి నిర్మాతతో పాటు ప్రభాస్ వెనక్కు తగ్గాల్సి వస్తోంది. సరే ప్రాజెక్ట్ కే పక్కకు వెళ్లిపోతోందని అర్ధమౌతోంది. వాట్ ఎబౌట్ ఓజీ. పవన్ తో సుజిత్ తీస్తున్న పవర్ ఫుల్ మూవీ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. ఇందులో ప్రభాస్ కూడా కామియో అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. సాహో తో ఓజీ కి లింకున్న స్టోరీ కాబట్టి ఇద్దరి ఫ్యాన్స్ పండగ చేసుకుందామంటే, అది కూడా కుదిరేలా లేదు.
సంక్రాంతికి అనుకున్న ఓజీ కూడా సమ్మర్ కే వాయిదా వేయాలనుకుంటున్నారట. ఏప్రిల్ లో ఈ మూవీ రావొచ్చట. చిరు, బాలయ్య, వెంకీ ఎవరి సినిమాలు సంక్రాంతికి రావట్లేదు. కమల్ భారతీయుడు సీక్వెల్ సమ్మర్ కే రాబోతోంది. పుష్ప 2 క్రిస్మస్ కే కాదు, సంక్రాంతికి కష్టం అనేస్తున్నారు. చెర్రీ గేమ్ ఛేంజర్ ఏకంగా వచ్చే ఏడాది జూన్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇలా చూస్తే సంక్రాంతికి బాక్సాఫీస్ మీద దాడి చేసే ఏకైక టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబునే. గుంటూరు కారం తప్ప సంక్రాంతికి సీన్ లో మరో బడా హీరో మూవీ ఉండట్లేదట. దీంతో వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది.