Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఎప్పుడు..? సినిమా వాయిదా పడుతుందా..?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లినప్పుడే మార్చి 8న రిలీజ్ అని అధికారకంగా ప్రకటించాడు డైరెక్టర్. టార్గెట్ రీచ్ అవ్వడంలో స్పెషలిస్ట్ అయిన పూరి ఖచ్చితంగా డెడ్ లైన్ అందుకుంటాడని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు.

Double iSmart: సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లడం వేరు. అనుకున్న డేట్‌కి రిలీజ్ చేయడం వేరు. ఎంత సీనియర్ డైరెక్టర్ అయినా రిలీజ్ డేట్‌కు టార్గెట్ రీచ్ అవ్వడం కత్తిమీద సామే. ఏమాత్రం తొందరపడినా క్వాలిటీ మిస్ అవుతుంది. ఇదే ఇప్పుడు ఓ సీక్వెల్ మూవీని టెన్షన్ పెడుతోంది. అనౌన్స్ చేసిన డేట్‌కి రిలీజ్ అవ్వడం కష్టంగా మారింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లినప్పుడే మార్చి 8న రిలీజ్ అని అధికారకంగా ప్రకటించాడు డైరెక్టర్.
Ramcharan: రామ్ చరణ్ కారును వెంబడించిన అభిమానులు.. షాక్ ఇచ్చిన చెర్రీ!
టార్గెట్ రీచ్ అవ్వడంలో స్పెషలిస్ట్ అయిన పూరి ఖచ్చితంగా డెడ్ లైన్ అందుకుంటాడని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. కట్ చేస్తే ఈసారి టార్గెట్ రీచ్ అవ్వడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఇంకా నలబై రోజుల వర్క్ పెండింగ్‌లో ఉందట. తొందరపడి హడావిడి చేస్తే క్వాలిటీ మిస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది. అలాగే డబుల్ ఇస్మార్ట్‌కి ఉన్న మరో సమస్య ప్రమోషన్లు. మార్చిలోనే రిలీజ్ చేయాలంటే వచ్చే నెల మూడో వారంలోపే షూటింగ్ పూర్తి చేయాలి. సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రమోషన్స్ నెల రోజుల ముందే స్టార్ట్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టైం దొరకడం కష్టం. పైగా లైగర్ డిజాస్టర్‌కి తగిన సమాధానం డబుల్ ఇస్మార్ట్‌తో చెప్పాలని పూరి కసితో ఉన్నాడు. స్కంద విషయంలో ఏకంగా ట్రోలింగ్ ఫేస్ చేసిన రామ్‌కు సైతం ఈ సినిమా రిజల్ట్ చాలా కీలకం. అందుకే డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ విషయంలో నిదానమే ప్రధానం అనుకుంటున్నారు.
నిజంగా డబుల్ ఇస్మార్ట్ వాయిదా పడితే విశ్వక్ సేన్‌కి పెద్ద రిలీఫ్ దక్కినట్టే. ఎందుకంటే అదే డేట్‌కి గ్యాంగ్స్ అఫ్ గోదావరి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా రిజల్ట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు విశ్వక్. డిసెంబర్‌లోనే రావాల్సిన ఈ సినిమా సలార్, హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా ఆర్టినరి మ్యాన్ వల్ల పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మార్చ్ 8కి డబుల్ ఇస్మార్ట్ తప్పుకుంటే విశ్వక్ సినిమాకి సోలో రిలీజ్ డేట్ దక్కినట్టే. ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ టీమ్ నుంచి న్యూస్ వచ్చే దాకా ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.