Ram Charan: ఇప్పటి దాకా తమన్, దేవి, కీరవాణి.. రాంచరణ్ నెక్స్ట్ మూవీ కి క్రేజి మ్యూజిక్ డైరెక్టర్ కంఫర్మ్ అయ్యాడా ?
మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాలలో మ్యూజిక్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. డాన్స్ లలో మంచి గ్రేస్ ఉన్న ఆయనకు స్టెప్స్ వెయ్యడానికి స్కోప్ ఇస్తూ ఎట్ ది సేమ్ టైం ఫాన్స్ ని ఫిదా చేసేలా సాంగ్స్ ఉండేలా చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్.

AR Rahman has been selected as the music director for Ram Charan's upcoming film
రాంచరణ్ ఫస్ట్ ఫిలిం చిరుత. ఈ సినిమాకి తన మ్యూజిక్ తో మేజిక్ చేసాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ ..ఆ నెక్స్ట్ రచ్చ లో రచ్చ రచ్చ చేసాడు అయన రాంచరణ్ మగధీర సినిమాకి కీరవాణి సంగీతం అందించి ఆ సినిమాని టాప్ చైర్ లో నిలిపాడు. ఆరంజ్ సినిమాకి హరీష్ జైరాజ్ ఓ రేంజ్ లో మ్యూజిక్ అందించి మ్యూజికల్ గా వండర్స్ చేసాడు. ఆ నెక్స్ట్ యువన్ శంకర్ రాజా , తమన్ , దేవిశ్రీప్రసాద్ లు రాంచరణ్ చిత్రాలకు మ్యూజిక్ అందించి మాస్ ని మంత్రించారు. ఎవడు , రంగస్థలం సినెమాలలకు సంగీతం అందించి ఆ మూవీస్ సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించాడు దేవిశ్రీప్రసాద్.
రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించి ఆస్కార్ ని ఔరా అనిపించాడు. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదంతా ఇలా ఉంటే.. రాంచరణ్ అండ్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో రెడీ అవుతోన్న కొత్త ప్రాజెక్ట్ కి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ చేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్ వచ్చేసింది. ఇక రెహమాన్ మ్యూజిక్ కి రామ్ చరణ్ వేసే స్టెప్స్ కోసం ఈగర్ గా వెయిట్ చెయ్యడం ఫాన్స్ వంతు అయింది.