AR Rahman: మెగా ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఏ ఆర్ రెహామాన్.. వద్దు బాబోయ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కోలీవుడ్ నుంచి గండం మొదలయ్యేలా ఉంది. ఏ ఆర్ రెహమాన్ రూపంలో ఆ గండం షురూ అయ్యిందట. ఆయన పేరు అంటే చాలు మెగా ఫ్యాన్స్ కంగారు పడాల్సి వస్తోందట. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్

Mega Star Chiranjevi and AR Rahaman Music Combo movie Fear to Fans
మెగాఫ్యాన్స్ కి ఆస్కార్ అచీవర్ ఏ ఆర్ రెహమాన్ కొత్త టెన్షన్ పెట్టాడు. దిల్ రాజు బ్యానర్ లో ఉప్పెన ఫేం బుచ్చిబాబు తీసే సినిమాకు ఏ ఆర్ రెహమానే మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడట. అక్కడి నుంచే మెగా ఫ్యాన్స్ కి కంగారు పెరిగింది. ఎందుకంటే ఏ ఆర్ రెహామాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తే తెలుగు సినిమాలు ఆడవు అన్న నెగెటీవ్ సెంటిమెంట్ ఉంది.
అసలు మెగా హీరోలకే రెహమాన్ మ్యూజిక్ అచ్చిరాలేదు. పవన్ కళ్యాణ్ కొమరం పులికి రెహామానే మ్యూజిక్ కంపోజ్ చేశాడు ఆ మూవీ ప్లాపైంది. ఇక చిరు గతంలో జెంటిల్మన్ హిందీ రీమేక్ లో నటిస్తే, దానికి అనుమాలిక్ మ్యూజిక్ చేసినా, తను మాత్రం జెంటిల్మన్ లో రెహమాన్ కంపోజ్ చేసిన పాటల్నే కాపీ కొట్టాడు. కట్ చేస్తే ది జెంటిల్మన్ ఫ్లాపైంది.
అప్పట్లో రాజశేఖర్ గ్యాంగ్ మాస్టర్ కి రెహమానే మ్యూజిక్ కంపోజ్ చేస్తే అది ప్లాపు. ఏదో పల్నాటి పౌరుషం లాంటి రీమేక్ మూవీ ఒక్కటే ఆడింది. సాహసమే శ్వాసగా సాగిపో లాంటి మూవీ ఆడింది.. ఐనా ఈ రెండు యావరేజ్ గానే ఆకట్టుకున్నాయి. వెంకటేష్ మూవీ సూపర్ పోలీస్ కూడా ఆ జమనాలో ఫ్లాపైంది. సో ఎలా చూసినా రెహమాన్ తెలుగు సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఆడవనే మాటే సెంటిమెంట్ గా మారింది. కాబట్టే బుచ్చి బాబు , రామ్ చరణ్ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అనగానే మెగా ఫ్యాన్స్ లో కంగారు షురూ అయ్యింది.