ఏఆర్ రహమాన్ డైవర్స్ క్యాన్సిల్… లాయర్ సంచలన కామెంట్స్
ఆస్కార్ విన్నింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ విడాకుల వ్యవహారం ఇండియన్ సినిమాను షేక్ చేసింది. తన భార్య సైరా భాను నుంచి ఏఆర్ రహమాన్ విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత రహమాన్ వద్ద పని చేసే మోహిని డే అనే అమ్మాయి విడాకులు తీసుకోవడం సంచలనం అయింది.
ఆస్కార్ విన్నింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ విడాకుల వ్యవహారం ఇండియన్ సినిమాను షేక్ చేసింది. తన భార్య సైరా భాను నుంచి ఏఆర్ రహమాన్ విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత రహమాన్ వద్ద పని చేసే మోహిని డే అనే అమ్మాయి విడాకులు తీసుకోవడం సంచలనం అయింది. ఆ తర్వాత దీనిపై ఇరు వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఇక 29 ఏళ్ళ బంధానికి అసలు ముగింపు పలకడానికి కారణం ఏంటీ అనే దానిపై జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసింది. అసలు ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది కూడా స్పష్టత రాలేదు.
ఈ తరుణంలో సైరా భాను లాయర్ వందనా షా కీలక వ్యాఖ్యలు చేసారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ.. పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో వాళ్లే ఫిక్స్ అవుతారన్నారు. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలేం కాదని వందనా షా కీలక విషయాలు మాట్లాడారు. వ్యక్తిగత అభిప్రాయాలు, స్వేచ్ఛ వారికి ఉందన్నారు. ఇక భరణం గురించి మాట్లాడుతూ.. సైరా ఎలాంటి ఆర్థిక ఉద్దేశాలతో ఈ నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చేసారు.
ఈ విషయంపై నేను ఎక్కువగా మాట్లాదలుచుకోలేదని వందనా షా టాపిక్ ను అక్కడితో కట్ చేసే ప్రయత్నం చేసారు. కాని ఓ సంచలన కామెంట్ తో సోషల్ మీడియాను ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసారు. అలాగే వీరిద్దరూ మళ్ళీ కలిసే అవకాశం లేకపోలేదన్నారు వందనా షా. నేను ఆశావాదిని ఎప్పుడు ప్రేమ, రొమాన్స్ గురించి మాట్లాడుతాను కానీ వాళ్ళు ఎన్నో చర్చల తర్వాత బాధతో విడాకుల నిర్ణయం తీసుకున్నారని వందనా షా పేర్కొన్నారు. అయినప్పటికీ వాళ్ళు కలిసే అవకాశం లేదని చెప్పలేము అంటూ డైవర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇక రహమాన్… మోహిని డే గురించి డైవర్స్ ఇచ్చారు అనే కామెంట్స్ రావడంతో సైరా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నేను ముంబయిలో ఉన్నాను… గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాలేదని… ఆ కారణంతోనే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నా అంటూ చెప్పుకొచ్చింది. యూట్యూబ్, తమిళ మీడియాను ఒక్కటే కోరుకుంటున్నా అన్న ఆమె… దయచేసి ఆయన గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయవద్దు అని రిక్వస్ట్ చేసారు. ఆయన చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి అన్నారు. ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో రెహమాన్ ఒకరు అని తన మాజీ భర్తను కొనియాడారు. సైరా ఎక్కడికి వెళ్లిందని అందరూ మాట్లాడుకుంటున్నారని… ట్రీట్‌మెంట్ కోసం ముంబయి వచ్చా అని స్పష్టం చేసారు. ఆయన అంటే నాకెంతో ఇష్టం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం… ఆయనపై విమర్శలు చేయడం ఇకనైనా ఆపండి అని రిక్వస్ట్ చేసారు. త్వరలోనే చెన్నై వచ్చి క్లారిటీ ఇస్తా అన్నారు.