యూట్యూబర్లకు ఏఆర్ రహమాన్ వార్నింగ్, కోర్టుకీడుస్తా…

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ విడాకుల వ్యవహారం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ ఆయన భార్య నుంచి రహమాన్ విడాకులు తీసుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 25, 2024 | 04:54 PMLast Updated on: Nov 25, 2024 | 4:54 PM

Ar Rahmans Warning To Youtubers

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ విడాకుల వ్యవహారం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ ఆయన భార్య నుంచి రహమాన్ విడాకులు తీసుకున్నారు. అక్కడి నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స లో దీనిపై ఎన్నో వార్తలు వచ్చాయి. అదే టైం లో… ఆయన వద్ద పని చేసిన మోహిని డే అనే అమ్మాయి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు ప్రకటన చేసింది. దీనితో ఒక్కసారిగా దుమారం రేగింది. వారి ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు ప్రచారం జరిగింది.

అటు తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియా సహా అన్ని భాషల్లో ఇది హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ చేసారు. దీనితో ఏఆర్ రహమాన్ లీగల్ టీం రెస్పాండ్ అయింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రెహమాన్‌ వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా తమకు తోచింది రాసినా, యూట్యూబ్‌ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని లీగల్ టీం పలు హెచ్చరికల నోటీస్ లను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో తీవ్ర హెచ్చరికలు చేసింది.

తన గురించి ఏ సామాజిక మాధ్యమం వేదికలోనైనా అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్‌ సూచించినట్టు ఆయన లీగల్ టీం ఆ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే పోస్ట్‌ చేసిన అభ్యంతరకర కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించాలని హెచ్చరించింది. లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. తనను మరియు అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న వారిని ఉద్దేశించి మూడు పేజీల నోటీసును షేర్ చేసింది.

సాక్ష్యాలు లేకుండా ఎవరైనా తన జీవితానికి సంబంధించిన కంటెంట్‌ను బయటపెడితే వెంటనే ఆపాలని అందులో డిమాండ్ చేసాడు. ఇక దీనిపై మోహిని డే కూడా రియాక్ట్ అయింది. దీని గురించి తాను చాలా వార్తలు చూస్తున్నాను అని… చాలా మంది తనను ఇంటర్వ్యూలకు కూడా పిలుస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. కాని తాను వెళ్ళడం లేదని పేర్కొంది. ఏది ఎలా ఉన్నా ఏ ఆర్ రహమాన్ విడాకుల వ్యవహారం మాత్రం మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఏ ఆర్ రహమాన్ మన తెలుగులో కూడా బిజీ అయ్యాడు. వరుస సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే మరో స్టార్ హీరోతో కూడా సైన్ చేసినట్టు టాక్.