పుష్ప కోసం బాలీవుడ్ హీరోను సైడ్ చేసిన అరవ డైరెక్టర్

పుష్ప 2 సక్సెస్ తో మంచి స్వింగ్ లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి ఈ సినిమా కోసం రెడీగా ఉన్నాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2025 | 05:00 PMLast Updated on: Feb 12, 2025 | 5:00 PM

Arava Is The Director Who Has Sidelined A Bollywood Hero For Pushpa

పుష్ప 2 సక్సెస్ తో మంచి స్వింగ్ లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి ఈ సినిమా కోసం రెడీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాను జనవరిలో స్టార్ట్ చేస్తారని ముందు వార్తలు వచ్చాయి. అయితే అల్లు అర్జున్ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాకు కాస్త దూరంగా ఉన్నాడు. ఇక ఫిబ్రవరిలో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని చాలామంది అంచనా వేశారు. రీసెంట్ గా మూవీ మేకర్స్ కూడా దీని గురించి క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అనౌన్స్మెంట్ ఇచ్చారు.

దీనితో అభిమానులు ఈ సినిమా టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక సినిమా బ్యాక్ డ్రాప్ అలాగే సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా కాకుండా, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది. పుష్ప సీక్వెల్ షూటింగ్ టైంలోనే అల్లు అర్జున్ కు అట్లీ స్టోరీ చెప్పాడు.

దీనికి అప్పట్లోనే అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడని ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని, ఆ టైంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. సినిమా చేసేందుకు అట్లు రెడీ అయ్యాడని ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ కావడంతో అట్లే టైం కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ ను మరోసారి కలిసినట్లు టాక్ వస్తుంది. దీంతో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో సినిమా రావడం పక్కా అనే క్లారిటీ వచ్చేసింది. అట్లీ సినిమా దాదాపు యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుంది అనేది అర్థం అవుతుంది.

ఇప్పటికే బాలీవుడ్లో అట్లీ తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ హీరోతో ఏ విధంగా సినిమా చేస్తాడో చూడాలి. అల్లు అర్జున్ తో ప్రాజెక్టు కోసం శ్రీనివాస్ ఒక డిఫరెంట్ యాంగిల్ ఉన్న స్టోరీ రెడీ చేసినట్లు వార్తలు వచ్చాయి. శివుడు తనయుడైన కార్తికేయుడు… యుద్ధ దేవుడుగా ఎలా మారాడు.. తండ్రి అయిన శివున్ని తిరిగి కలవడానికి కార్తికేయ బయలుదేరినప్పుడు… అతని ప్రయాణం ఎలా సాగింది అనే కథతో ఈ చిత్రం ఉంటుందని వార్తలు వచ్చాయి. సోషల్ మైథాలజికల్ ఫాంటసీ నేపద్యంలో ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ ప్లాన్ చేసాడని వార్తలు వచ్చాయి.