హైపర్ ఆది ఆస్తులు అన్ని కోట్లా..? IT వాళ్లకు తెలిస్తే ఆపకుండా చేస్తారు రైడ్స్..!
జీవితంలో జీరో నుంచి మొదలుపెట్టి హీరోగా మారితే వచ్చే కిక్కు ఇంకేం చేసినా రాదు. తాజాగా హైపర్ ఆది విషయంలోనూ ఇదే జరుగుతుంది.

జీవితంలో జీరో నుంచి మొదలుపెట్టి హీరోగా మారితే వచ్చే కిక్కు ఇంకేం చేసినా రాదు. తాజాగా హైపర్ ఆది విషయంలోనూ ఇదే జరుగుతుంది. మనోడు పదేళ్ళ కింద యూ ట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోలు చేసుకునేవాడు. బిటెక్ పూర్తి చేసి ఏం చేయాలో తెలియక.. సాఫ్ట్ వేర్ సైడ్ కొన్ని రోజులు వెళ్లి ఇలా సినిమా రంగం వైపు వచ్చాడు. ఇక్కడికి వచ్చాక టాలెంట్‌తో పాటు లక్కు కూడా లాగి తన్నేసరికి దెబ్బకు స్టార్ అయిపోయాడు ఆది. తనదైన పంచులతో పిచ్చెక్కించే ఆది.. బుల్లితెరపై సక్సెస్ అయినంతగా ఎందుకో తెలియదు కానీ వెండితెరపై మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. మనోడు కేవలం నటన మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ అప్పుడప్పుడూ పంచులు వేస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయన ఇంటిపై.. ఆస్తులపై వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. జబర్దస్త్ కామెడీ షోలో రెమ్యునరేషన్స్ చాలానే ఉన్నాయి. ఒక్కొక్కరికీ లక్షల్లోనే పారితోషికాలు అందుతున్నాయి.
మల్లెమాల సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా రెమ్యునరేషన్ ఇస్తుంది. మరోవైపు కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా అదే కమెడియన్లతో శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు మరికొన్ని ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అలా నెలకు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి కమెడియన్లు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. వాళ్ల సంపాదన చిన్న సైజ్ హీరోల మాదిరే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏడాదికి కోట్లకు చేరిపోయింది వీళ్ళ సంపాదన. ఈ మధ్యే ఈటీవిలో జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో తనకున్న ఆస్తుల గురించి కూడా ఓపెన్ అయ్యాడు హైపర్ ఆది. తను చదువుకునేప్పుడే చాలా ఖర్చులు అయ్యాయని.. అప్పట్లోనే 20 లక్షల అప్పు అయిందని గుర్తు చేసుకున్నాడీయన. హైదరాబాద్ వచ్చేటప్పుడు తన తండ్రి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని మరీ తనకు ఇచ్చాడని.. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత డబ్బు కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు. అదిరే అభి దయతో జబర్దస్త్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఆ తర్వాత మెల్లగా టీమ్ లీడర్ అయ్యాడు.
ఈ రోజు హైపర్ ఆది అంటే బ్రాండ్. అప్పట్లో తమ అప్పులు కట్టడానికి ఉన్న మూడు ఎకరాలు అమ్మేసాడు వాళ్ల నాన్న. కానీ తాను జబర్దస్త్‌కు వచ్చిన తర్వాత అదే ఊరిలో ఏకంగా 16 ఎకరాలు కొనేసాడు ఆది. దాంతో తన తండ్రికి పది వేళ్లకు పది ఉంగరాలు కూడా చేయించాడు.. పొలం కొనడంతో పాటు మరిన్ని ఆస్తులు కూడా కొనేసాడు హైపర్ ఆది. హైదరాబాద్‌లోనూ ఈయనకు ఓ ఇల్లు ఉంది. యూ ట్యూబ్‌లోనూ కొన్ని వీడియోలు చేస్తూ సంపాదిస్తున్నాడు. క్రేజ్ ఉన్నపుడే సంపాదించుకోవాలనే సూత్రాన్ని బాగా పాటిస్తున్నాడు ఆది. ఇంద్రభవనం కాకపోయినా.. హైదరాబాద్‌లో మంచి ఇల్లు కొన్నానని చెప్పాడు ఆది. బాల్కనీలో కూర్చున్నపుడు తనకు అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయని.. అక్కడ కూర్చుని ఐడియాలు రాసుకుంటానని చెప్పాడు ఆది. అక్కడే స్క్రిప్టులు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ఇవన్నీ చూసాక ఐటి వాళ్లకు నీ ఆస్తుల విలువ తెలిస్తే ఆపకుండా చేస్తారన్నా నీపై రైడ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.