స్మగ్లర్లు హీరోలా..? ‘పుష్ప’ను మళ్లీ వేసుకున్నారుగా..! అయ్యో పాపం భాయ్..!
పుష్ప సినిమాకు ముందు కూడా హీరోలు స్మగ్లింగ్ పాత్రలు చేసారు.. పోలీసులకు చుక్కలు చూపించే క్యారెక్టర్స్ చేసారు. అలాంటి పాత్రలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు కూడా. కానీ అదేంటో గానీ పుష్ప తర్వాతే ఈ తరహా క్యారెక్టర్స్ గురించి నెగిటివిటీ పెరిగిపోయింది.

పుష్ప సినిమాకు ముందు కూడా హీరోలు స్మగ్లింగ్ పాత్రలు చేసారు.. పోలీసులకు చుక్కలు చూపించే క్యారెక్టర్స్ చేసారు. అలాంటి పాత్రలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు కూడా. కానీ అదేంటో గానీ పుష్ప తర్వాతే ఈ తరహా క్యారెక్టర్స్ గురించి నెగిటివిటీ పెరిగిపోయింది. హీరో అంటే రాముడు మంచి బాలుడులాగే ఉండాలంటూ స్టేజీపై ఉపన్యాసాలు దంచేస్తున్నారు కొందరు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఈ మధ్య సినిమాల తీరు గురించి మాట్లాడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా.. సినిమాలు వస్తున్న తీరు గురించి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు తోటి నటులు కూడా సినిమాలపై సెటైర్లు వేస్తున్నారు. ఆ మధ్య ఓ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ పుష్ప సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
స్మగ్లింగ్ చేసుకునేవాడు హీరో మనకు ఈ రోజుల్లో అంటూ కామెంట్ చేసాడు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత తను పుష్పను అనలేదంటూ క్లారిటీ ఇచ్చాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్మగ్లింగ్ చేసేవాళ్లను హీరోలుగా చూపిస్తున్నారంటూ కామెంట్ చేసాడు. దీనిపై కూడా చాలా పెద్ద దుమారమే రేగింది. తాజాగా రాజకీయ నాయకుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరో పాత్రల తీరుపై దర్శకులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారాయన. మళ్లీ అందులో కూడా స్మగ్లింగ్ గురించే చర్చంతా. ఒకప్పుడు సినిమాల నుంచి ప్రజలకు మంచి సందేశం వెళ్లేదని… ఇప్పుడు స్మగ్లర్లు, దేశ ద్రోహులు, సమాజంలో తప్పుడు విధానాలు పాటించే వాళ్లతో హీరో పాత్రలను డిజైన్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసారు వెంకయ్య నాయుడు.
ఇది మంచి పద్ధతి కాదని, దీనివల్ల ఎలాంటి సందేశం వెళుతుందో దర్శకులు ఒకసారి ఆలోచించాలన్నారాయన. చెడ్డ పనులను ఎప్పుడూ సినిమాల్లో గొప్పగా చూపించరాదని.. అలా చేస్తే ఆ ప్రభావం పిల్లలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు. సినిమా రంగం బాధ్యతాయుతంగా ఉండాలంటూ చెప్పుకొచ్చారు. ఈ మధ్యే మరణించిన తెలుగు చిత్ర పరిశ్రమ తొలితరం నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభలో ఈ వ్యాఖ్యలు చేసారు వెంకయ్య నాయుడు. ఈయన అన్నాడని కాదు కానీ పుష్ప సినిమా వచ్చిన తర్వాత స్మగ్లింగ్ నేపథ్యం ఉన్న సినిమాల గురించి చాలా మంది స్టేజీపై మాట్లాడుతున్నారు. వాళ్లు టార్గెట్ చేసినా చేయకపోయినా.. ట్రిగ్గర్ అవుతున్నది మాత్రం అల్లు అర్జున్ పుష్ప సినిమానే.