కోర్ట్ జోడి నిజంగానే ప్రేమలో ఉన్నారా.. బయట అసలు ఏం జరుగుతుంది..?

కొన్ని సినిమాలు మనమేదో తెలియకుండానే ఇంపాక్ట్ బాగా చూపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన కోర్టు సినిమా అలాంటిదే. నాని నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి కీలక పాత్ర చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2025 | 11:30 AMLast Updated on: Mar 27, 2025 | 11:30 AM

Are The Court Couple Really In Love Whats Really Going On Outside

కొన్ని సినిమాలు మనమేదో తెలియకుండానే ఇంపాక్ట్ బాగా చూపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన కోర్టు సినిమా అలాంటిదే. నాని నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి కీలక పాత్ర చేశాడు. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా దాదాపు 50 కోట్లు వసూలు చేసింది. ప్రేక్షకులకు పెద్దగా ఐడియా లేని ఫోక్సో చట్టం గురించి ఈ సినిమాల్లో చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్. తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ కోర్టు డ్రామా ఇది. కథ ఎక్కడ ఎలాంటి మలుపులు తిరగాలో అన్ని తిరిగి బ్లాక్ బస్టర్ అయింది కోర్టు సినిమా. ఇందులో నటించిన లీడ్ పెయిర్ కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతున్నారు. ఎక్కడికి వచ్చినా కూడా కలిసి వస్తున్నారు.. కలిసి వెళ్తున్నారు. మీడియా ఇంటర్వ్యూలు కూడా జంటగానే ఇస్తున్నారు. ఇలా వీళ్ళ ఇద్దరినీ చూసిన తర్వాత నిజంగానే వీళ్ళు ప్రేమలో ఉన్నారా ఏంటి అని అనుమానం కూడా రాకపోదు. అంత బాగా కలిసిపోయారు రోషన్, ఈరోజు సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అంటే వాళ్ళ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. వాళ్లు కలిసి కనిపించిన ప్రతి సన్నివేశం సినిమాలో అదిరిపోయింది.

బయట కూడా అదే కంటిన్యూ అవుతుంది. జంట చూడముచ్చటగా ఉండడంతో.. రియల్ లైఫ్ లో కూడా లవ్ లో పడ్డారేమో అనే అనుమానాలు వస్తున్నాయి. కాకపోతే సినిమాలో చూపించినట్టు నిజంగానే ఇద్దరు చిన్నపిల్లలు. జస్ట్ ఇప్పుడే మేజర్ ఏజ్ లోకి ఎంటర్ అయ్యారు. పైగా కెరీర్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. అప్పుడే ప్రేమలు దోమలు అంటూ రిస్క్ చేసేంత ధైర్యం అయితే చేయకపోవచ్చు. కాకపోతే వీళ్ళు బయట కలిసి కనిపించినప్పుడు కచ్చితంగా ఈ అనుమానాలు మరింత బలంగా వస్తున్నాయి. సినిమా కాదు ప్రమోషన్ గా కూడా పనికొస్తుంది. పైగా ఏ ఇంటర్వ్యూలో చూసిన కూడా ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఓకే ఏజ్ గ్రూప్ కావడంతో ఒకేలా ఆలోచిస్తున్నారు కూడా. జోకులు వేసుకుంటూ సరదాగా అలా గడిపేస్తున్నారు రోషన్ శ్రీదేవి జంట. వీళ్ళ స్నేహం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కచ్చితంగా అది ఫ్యూచర్లో ప్రేమగా మారే అవకాశాలు లేకపోలేదు అనే వాళ్ళు కూడా లేరు.

ఎందుకంటే ఇలా మొదటి సినిమాలో ప్రేమలో పడిన వాళ్ళు చాలామంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ల ప్రేమను మొదటి సినిమా నుంచి మొదలుపెట్టి చివరికి పెళ్ళి వరకు తీసుకొచ్చారు. మన కళ్ళముందే ఉన్న జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ ప్రేమ కథ కూడా అలాంటిదే. మొదటి సినిమా తుజే మేరీ కసం టైంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పదేళ్లు ఆ ప్రేమను కంటిన్యూ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ జోడి వీళ్లే. అలా మొదటి సినిమాతో పుట్టిన ప్రేమ చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు కోర్టు సినిమా జంటకు కూడా ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇది కేవలం ప్రమోషన్ కోసం అయితే ఓకే కానీ నిజమే అయితే మాత్రం జోడి చూడడానికి ఆసక్తికరంగా ఉంది.